చాలా రోజులుగా వినిపిస్తున్న వార్తలు నిజమయ్యాయి. రెండు రోజుల క్రితం వెల్లడించినట్లే అయింది. మెగాస్టార్-పూరి సినిమా అటకెక్కేసింది. అలాగే మెగాస్టార్ షష్టిపూర్తికి 150వ సినిమా ఓపెనింగ్, ప్రకటన లాంటివి లేవనీ తేలిపోయింది.
ఎప్పుడైతే పూరి గురువు రామ్ గోపాల్ వర్మ, తన ట్వీట్ లను మెగాస్టార్ పై వరుసగా ప్రయోగించడం మొదలు పెట్టాడో అప్పుడే అర్థమైపోయింది. పూరి సినిమా లేదని. వర్మ ట్వీట్లన్నీ వెటకారాలే తప్ప వేరు కాదని. ఎప్పుడైతే శ్రీమంతుడు ఈ రేంజ్ హిట్ అయిందో, సాథారణంగా సేప్ జోన్ లో వుండాలని కోరుకునే చిరంజీవి, ఇప్పట్లో సూపర్ కథ దొరికే వరకు చేయరని, రెండు మూడు రోజుల క్రితమే తెలియవచ్చింది.
కత్తి సినిమా చేద్దామనుకున్నా, టెక్నికల్ ప్రోబ్లమ్స్ అడ్డం పడ్డాయి. దాంతో మరి ఈ పుట్టిన రోజున సినిమా ప్రకటన వుండదని అర్థమైపోయింది. ఇప్పుడు ఇదే నిజమైంది. ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో మరో రెండు మూడు నెలల వరకు 150 వ సినిమా సంగతి ఏమీ లేదని చిరంజీవి చెప్పినట్లు బయటకు పొక్కింది. అంటే కథ కంచికి..సినిమా వెనక్కి అన్నమాట.