ఏ సినిమా అయినా పేపర్ మీదనుంచి స్క్రీన్ మీదకి వెళ్లాలంటే హీరో అప్రూవల్ కావాల్సిందే. ఒక్కసారి హీరో ఓకే అన్నాక ఏ సినిమా పని అయినా స్పీడప్ అవుతుంది. అలాగే 'ఆర్ ఎక్స్ 100' దర్శకుడు ఏడాది అందరి చుట్టూ తిరిగిన తర్వాత రవితేజ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. దాంతో కథ లాక్ చేసుకుని, కాస్టింగ్ ఫైనలైజ్ చేయడంపై దృష్టి పెట్టాడు. కానీ ఇంతలో పారితోషికం వద్ద పేచీ పెట్టి రవితేజ వేరే చిత్రాన్ని పట్టాలెక్కించాడు.
దీంతో దర్శకుడు అజయ్ భూపతి మరో హీరోని వెతుక్కుని తన కథతో కన్విన్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఫ్లాపుల్లో వున్న హీరో లాస్ట్ మినిట్‌లో ఈ సినిమా వదిలేసుకున్నాడంటే ఏ హీరో అయినా ఇక దానిని డౌట్‌ఫుల్‌గానే చూస్తాడు కనుక అతనికిప్పుడు ఇంకో హీరో దొరకడం కష్టమే అనాలి. అలాగే ఈ చిత్రంతో తెలుగు చిత్ర రంగంలోకి గ్రాండ్‌గా రీఎంట్రీ ఇవ్వాలని అనుకున్నాడు సిద్ధార్థ్.
ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర చేయడానికి అతను అంగీకరించాడు. అలాగే హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ కూడా ఓకే చెప్పింది. వరుసగా ఫ్లాప్స్ వస్తోన్న టైమ్‌లో ఈ చిత్రంపై ఆమె గంపెడాశ పెట్టుకుంది. కానీ అందరి ఆశలపై రవితేజ నీళ్లు చల్లేసాడు. చాలా క్యాజువల్‌గా వేరే సినిమాకి ఓకే చెప్పేసి దాని పనులకి శ్రీకారం చుట్టుకోమని చెప్పేసాడు. రవితేజ 'డిస్కోరాజా' పూర్తి చేయడమే ఆలస్యం ఈ చిత్రం స్టార్ట్ చేసుకోవచ్చు అనుకున్న వారికి 'చీప్ స్టార్' అనే ఫీలింగ్ తెచ్చాడు.