ముకుందలో శేఖర్ కమ్ముల?

విడుదల దగ్గర పడుతున్న కొద్దీ ముకుంద సినిమా విశేషాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.  సినిమాలో హీరో హీరోయిన్లకు పేర్లు లేవని నిన్నటికి నిన్న బయటపడితే, ఇప్పడు తాజాగా మరో విషయం తెలుస్తోంది. ఈసినిమాలో దర్శకుడు…

విడుదల దగ్గర పడుతున్న కొద్దీ ముకుంద సినిమా విశేషాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.  సినిమాలో హీరో హీరోయిన్లకు పేర్లు లేవని నిన్నటికి నిన్న బయటపడితే, ఇప్పడు తాజాగా మరో విషయం తెలుస్తోంది. ఈసినిమాలో దర్శకుడు శేఖర్ కమ్ముల ఓ సీన్ లో తళుక్కున మెరుస్తారని టాలీవుడ్ బోగట్టా.  

ఆయనే కాదు, సినిమా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కూడా అలా మెరిసి మాయమవుతారని తెలుస్తోంది. ఇలా ఇద్దరు దర్శకులు స్క్రీన్ మీద కనిపించాల్సి వచ్చిందంటే, అది సమ్ థింగ్ స్పెషల్ అయి వుంటుందనడంలో సందేహం లేదు. అదేమిటో తెలియాలంటే ఈ నెల 24వరకు ఆగాల్సిందే.