తెలుగునాట హిట్ అయిన మల్టీ స్టారర్ లు తక్కువ. మన హీరోలు పైకి ఎన్ని కబుర్లు చెప్పినా, స్క్రీన్ స్పేస్ దగ్గర, మిగిలిన వ్యవహారాల దగ్గర తేడా రానే వస్తుంది. విక్టరీ వెంకటేష్ చాలా కాలంగా మల్టీ స్టారర్ లకే మొగ్గు చూపుతున్నారు. సీనియర్ హీరోగా మారిపోయినందున, యంగ్ హీరోల సాయం వుండాలనే ఆయన తెలివిగా ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ తీరా ఎగ్జిక్యూషన్ లోకి వచ్చేసిరికి ఫోకస్ ఆయన మీదకే వుంటుంది. సినిమా గాడి తన్నేస్తుంది.
మసాలా సినిమా పరిస్థితి తెలిసిందే. సీతమ్మ వాకిట్లో…సినిమా కో స్టార్ మహేష్ బాబు కాబట్టి సమస్య లేకపోయింది. నాగ్ చైతన్యతో వెంకీమామ చేసారు. మేనల్లుడు కాబట్టి పాత్రలు ఈక్వెల్ గా వుంటాయాని అనుకున్నారు అంతా. కానీ ఇక్కడా వెంకీకే ఎక్కువ ప్రాధాన్యత వుందని, చైతన్య పాత్రను అంతగా డిజైన్ చేయలేదని ఫ్యాన్స్ నుంచి కంప్లయింట్ వచ్చినట్లు తెలుస్తోంది.
మరి దాని ప్రభావమో, లేదా మరెందువల్లనో ఇప్పట్లో మల్టీ స్టారర్ చేయడానికి నాగ్ చైతన్య ఇష్టపడడం లేదని తెలుస్తోంది. బంగార్రాజు సినిమాలతో తండ్రితో కలిసి చేయాల్సి వుంది. ఆ సినిమాకు ముందుగా ఒకటి రెండు సినిమాలు అయినా సోలోగా చేయాలని చైతూ డిసైడ్ అయినట్ల బోగట్టా. పరుశురామ్ తో సినిమా అయిన తరువాత, లేదూ అంటే మరో సినిమా కూడా సోలోగా చేయాలని,
అప్పుడే మల్టీ స్టారర్ చేయాలని చైతన్య ఫిక్స్ డ్ గా వున్నట్లు బోగట్టా. అజయ్ భూపతి మహా సముద్రం సినిమాను చేయడానికి చైతన్య సుముఖంగా లేరు. మంచి కథ, తనకు నచ్చినా కూడా చైతన్య ఈ కారణంగానే దానికి దూరంగా వున్నారు.
బంగార్రాజు స్వంత సినిమా కాబట్టి, పరుశురామ్ సినిమా తరువాత చేసే అవకాశం వుంది. కానీ ఆ తరువాత మాత్రం మల్టీ స్టారర్ ల జోలికి చైతన్య వెళ్లడం అన్నది అనుమానమే.