మందు కొట్టడం అన్నది ఇవ్వాళ, రేపు కామన్. కడు బీదవాడి దగ్గర నుంచి కరోర్ పతి వరకు ఇదే వ్యవహారం. అయితే మంచి ప్రొఫెషన్ లో వున్నవారు కాస్త ఆచి తూచి మందు కొడతారు.
మరీ పీపాలకు పీపాలు ఖాళీ చేయరు. మరీ ముఖ్యంగా హీరోలుగా ఓ స్టేజ్ లో వున్నవారు అస్సలు ఆపని చేయరు. మరింత ఎదగాలని జాగ్రత్తగా వుంటారు.
కానీ టాలీవుడ్ లో ఇద్దరు యంగ్ హీరోలు మాత్రం రాత్రంతా మందు మీదే వుంటున్నారని బోగట్టా. ముఫై నుంచి నలభై కోట్ల రేంజ్ హీరోలుగా ఎదిగిన ఈ ఇద్దరు మంచి స్నేహితులే.
వీరిలో ఒక హీరోకు రాత్రంతా మందు, పగలు నిద్ర అన్నది చిరకాల అలవాటు. షూటింగ్ వుంటే ఓకె లేదూ అంటే ఇదే కార్యక్రమం. రాత్రంతా మందు కోట్టేసి, ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసి పడుకుని సాయంత్రం లేచి జిమ్ చేస్తాడట.
ఇప్పుడు ఇతగాడికి మరో యంగ్ హీరో తోడయ్యాడు. ఇద్దరు కలిసి రాత్రంతా మందు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారట. ఆఫ్ కోర్స్ ఇద్దరికీ కెరీర్ మీద సీరియస్ దృష్టి వుంది. జాగ్రత్తగానే ప్లాన్ చేసుకుంటున్నారు.
కానీ అదే జాగ్రత్త హెల్త్ మీద కూడా వుండాలి కదా? అందులోనూ ఒకరికి పెళ్లయింది కూడా. వాళ్ల సంగతి కూడా ఆలోచించాలి కదా?