తెలుగు సినిమా జనాల దృష్టి మీదకు మళ్లింది. దిల్ రాజు, అల్లు అరవింద్, హారిక హాసిని బాలీవుడ్ బాట పట్టారు. నిజానికి మన జనాలు బాలీవుడ్ లో చాలా దశాబ్దాల క్రితమే అడుగుపెట్టారు. దర్శకులు దాసరి, రాఘవేంద్రరావు, బాపు, తాతినేని రామారావు, బాపయ్య ఇలా చాలా మంది చాలా సినిమాలు చేసారు. కానీ చాలా వరకు అక్కడి నిర్మాతలతో. ఎల్వీ ప్రసాద్ లాంటి కొంత మంది నిర్మాతలు కూడా వెళ్లారు.
కానీ ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చింది. మన నిర్మాతలు అటు వెళ్లే టైమ్ వచ్చింది. దీనికి కారణం మరేం లేదు. బాలీవుడ్ లో భారీ సినిమాలు ఫ్లాప్ అనిపించుకున్నా, రెండు మూడు వందల కోట్లు బిజినెస్ చేస్తున్నాయి. నష్టాలు అన్నది తక్కువగా వుంది. మన దగ్గర పెద్ద హీరోల సినిమాల బిజినెస్ ఎంత లెక్క వేసుకున్నా, 150 కోట్లు దాటడం లేదు. కానీ ఖర్చు మాత్రం అంతకు అంతా అయిపోతోంది.
ఇలాంటపుడు ఇంత ఖర్చు ఇక్కడ పెట్టే కన్నా అక్కడకు వెళ్తే బెటర్ అన్న ఆలోచన కనిపిస్తోంది. అందుకే దిల్ రాజు, అల్లు అరవింద్ వంటి వాళ్లు అటు వెళ్తున్నారు. దీంతో మైత్రీ మూవీ మేకర్స్ కూడా అటే బయల్లేరారు. సల్మాన్ ఖాన్ బంధువులతో కలిసి భాగస్వామ్యం పెట్టుకుని వరుసగా బాలీవుడ్ లో సినిమాలు నిర్మించే పనిలో పడ్డారు. ఇఫ్పటికే సల్మాన్ తో ఓ భేటీ పూర్తయింది. ఇది మరో కొన్ని నెలల్లో మరింత ముందుకు వెళ్తుంది. సరైన ప్రాజెక్టు దొరికితే నిర్మాణం ప్రారంభిస్తారు.