మైత్రీకి వర్కవుట్ కానీ అడ్వాన్స్ లు

డబ్బులతో అన్నీ జరిగిపోవు. అడ్వాన్స్ లు కొట్టేసినంత మాత్రాన సినిమాలు క్యూ కట్టేయవు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ విషయం ఎప్పుడు తెలుసుకుంటారో? ఎప్పటికి సినిమా వ్యవహారాలు అర్థం అవుతాయో? మైత్రీ మూవీ మేకర్స్…

డబ్బులతో అన్నీ జరిగిపోవు. అడ్వాన్స్ లు కొట్టేసినంత మాత్రాన సినిమాలు క్యూ కట్టేయవు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ విషయం ఎప్పుడు తెలుసుకుంటారో? ఎప్పటికి సినిమా వ్యవహారాలు అర్థం అవుతాయో? మైత్రీ మూవీ మేకర్స్ సడెన్ గా ఇండస్ట్రీలోకి దూసుకువచ్చారు. ముగ్గురు మిత్రులు, వారి మిత్రులు ఇలా చాలా మంది అండదండలతో భారీగా ఎంట్రీ ఇచ్చారు. వస్తూనే, పవన్ కళ్యాణ్, ప్రభాస్, బోయపాటి, తివిక్రమ్ ఇలా చాలా మందికి  అడ్వాన్స్ లు కొట్టారు. కానీ కేవలం మహేష్, ఎన్టీఆర్ లతో మాత్రమే సినిమాలు చేయగలిగారు.

ఆ తరువాత అనుకోకుండా లైనప్ అయిన సినిమాలే తప్ప, ముందుగా ప్లాన్ చేసినవి జరగలేదు. ఈ రోజుకు ఇచ్చిన అడ్వాన్స్ లు ఒక్కటి కూడా వర్కవుట్ కాలేదు. త్రివిక్రమ్ అడ్వాన్స్ వెనక్కు తీసుకోవడం పక్కా. అయితే అది వడ్డీలు, చక్రవడ్డీలు కలిపి 8 కోట్లా? 12 కోట్లా? 15 కోట్లా? అన్నది తేలాల్సి వుంది. 

బోయపాటి అడ్వాన్స్ వుంది. ప్రస్తుతం బోయపాటి లైనప్ బాలేదు. బాలయ్యతో చేస్తున్న సినిమా హిట్ అనిపించుకుంటేనే మైత్రీ ముందుకు వెళ్తుంది. లేదూ అంటే ఆ అడ్వాన్స్ కూడా వెనక్కు తీసుకోవాల్సిందే. మహేష్, ఎన్టీఆర్, చరణ్ వీళ్లెవరు బోయపాటితో సినిమా చేసే అవకాశం లేదు. ఇక మిగిలింది  బన్నీనే. ఆయన ఇప్పుడే మైత్రీకి సినిమా చేస్తున్నారు. అందువల్ల బోయపాటి దగ్గర అడ్వాన్స్ వుండి ప్రయోజనం ఏమిటి?

ఇక ప్రభాస్ కు అడ్వాన్స్ ఇచ్చి చాలాకాలం అయింది. ఆయన ప్రస్తుతం హోమ్ బ్యానర్ లో సినిమా చేస్తున్నారు. దాని తరువాత దిల్ రాజుకు సినిమా చేయాలి. ఆ తరువాత ఎలా వుంటుందో అన్నది ఇఫ్పుడే చెప్పలేని సంగతి. రాజమౌళి సినిమా అనే గ్యాసిప్ కూడా వుంది. ఆ విధంగా ఇంక మైత్రీకి వర్కవుట్ అవుతుందా ఈ అడ్వాన్స్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంగతి చెప్పనక్కరే లేదు. ఆయన కు అడ్వాన్స్ ఇచ్చి ఏళ్లు దాటుతోంది. ఇప్పటికి సినిమా లేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలా దిల్ రాజు సినిమా వచ్చి చేరింది. దాని తరువాత క్రిష్ సినిమా వుంది. ఈ రెండింటి సక్సెస్ ను బట్టి పవన్ తరువాత సినిమాలు వుంటాయి. అప్పటికి పవన్ మూడ్ ఎలా వుంటుందో కూడా తెలియదు. రాజకీయ పరిస్థితులను బట్టి వుంటుంది. అన్నీ కుదిరితే అప్పుడు మైత్రీ సినిమా. అదే త్రివిక్రమ్ ఎంటర్ అయితే వ్యవహారం మారిపోతుంది. 

విజయ్ దేవరకొండకు అడ్వాన్స్ ఇచ్చి, రెండో సినిమా హీరో మొదలుపెట్టారు. అది కాస్తా ఆదిలో బ్రేక్ తీసుకుంది. ఆయన పూరి సినిమా మీదకు వెళ్లారు. ఈ లోగా చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ బకెట్ తన్నేసింది. పూరి సినిమా సక్సెస్ అయితే ఓకె. వెల్ అండ్ గుడ్., లేదూ అంటే విజయ్ మార్కెట్ కొలాప్స్ అవుతుంది. అప్పుడు మైత్రీ ప్రాజెక్టు సంగతి ఏమవుతుందో చూడాలి. 

మైత్రీకి వున్న హోప్ అంతా బన్నీ-సుకుమార్  సినిమా, ఆ తరువాత ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ సినిమా మీదనే. అంతవరకు ఈ ఇచ్చిన అడ్వాన్స్ లకు వడ్డీలు లెక్కలు వేసుకుంటూ వుండాల్సిందే. కానీ మైత్రీ మూవీ మేకర్స్ పాయింట్ వేరుగా వుంది. ఇలా అగ్రెసివ్ గా ముందుకు వెళ్లడం వల్లనే ఇన్ని సినిమాలు చేస్తున్నామని, అప్పట్లో అడ్వాన్స్ ఇచ్చి వుండకపోతే, ఇప్పుడు పవన్, ప్రభాస్ ప్రాజెక్టులు సాధ్యమా? అన్నది వారి పాయింట్ గా వుంది.

ఆ నడుము సీన్లు నాకు సెంటిమెంట్