మైత్రీతో పరుశురామ్ కు మైత్రీ లేదా?

గీతగోవిందం సినమా బ్లాక్ బస్టర్ అయిన రోజులు. డైరక్టర్ పరశురామ్ కు మైత్రీ నుంచి భారీ అడ్వాన్స్ అందిన కాలం అది. ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్ల తరువాత పరుశురామ్-మైత్రీ కాంబినేషన్ తెరపైకి వచ్చింది. కానీ…

గీతగోవిందం సినమా బ్లాక్ బస్టర్ అయిన రోజులు. డైరక్టర్ పరశురామ్ కు మైత్రీ నుంచి భారీ అడ్వాన్స్ అందిన కాలం అది. ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్ల తరువాత పరుశురామ్-మైత్రీ కాంబినేషన్ తెరపైకి వచ్చింది. కానీ అసలు పరుశురామ్ సీరియస్ గా మైత్రీ తో సినిమా చేయాలనే అనుకుంటున్నారా? లేక 14రీల్స్ కు చేయాలని అనుకుంటున్నారా?

ఎందుకంటే గీతం గోవిందం టైమ్ నుంచి ఇప్పటి వరకు బోలెడు జరిగాయి. ముందుగా అల్లు అరవింద్ కాంపౌండ్ ను వదిలి నేరుగా మహేష్ ను కలిసి లైన్ చెప్పారు. దీనికి మరో డైరక్టర్ కొరటాల శివ మార్గదర్శనం చేసారు. అప్పట్లో ఆయన కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామి అవుతారనే వార్తలు వచ్చాయి. కానీ అది అక్కడే ఆగిపోయింది.

ఆ తరువాత పరుశురామ్ ఎన్నో ప్రయత్నాలు చేసి, ఆఖరికి నాగ్ చైతన్యను ప్రాజెక్టుకు ఒప్పించారు. ఆయన ఆ ప్రాజెక్టును మైత్రీ దగ్గరకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కానీ చైతన్య రెమ్యూనిరేషన్, పరుశురామ్ రెమ్యూనిరేషన్ లెక్క వేసుకుంటే ఈ ప్రాజెక్టు వర్కవుట్ కాదని అప్పట్లో మైత్రీ మూవీస్ వీటో చేసినట్లు తెలుస్తోంది. దాంతో నాగ్ చైతన్య స్వయంగా 14రీల్స్ ను సీన్ లోకి తీసుకువచ్చారు. ఆ సమయంలో పరుశురామ్ అడ్వాన్స్ విషయంలో మైత్రీ తో చిన్న ఆర్గ్యుమెంట్ కూడా జరిగిందని బోగట్టా. అప్పట్లోనే కొంత అడ్వాన్స్ వెనక్కు ఇచ్చినట్లు వార్తలు కూడా వినిపించాయి. 

ఆ విధంగా నాగేశ్వరరావు సినిమా ప్రాజెక్టు స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టును పక్కన పెట్టాలంటే చిన్న విషయం కాదు. నాగ్ చైతన్య హర్ట్ కాకూడదు. చైతూను ఒప్పించాలంటే 14రీల్స్ కు బలమైన కారణం కావాలి. ఆ బలమైన కారణం మహేష్ తో సినిమానే. ఇప్పుడు బాల్ వెళ్లి నమ్రత కోర్టులో పడినట్లు తెలుస్తోంది.

14రీల్స్ ను మైత్రీని కలిపి సినిమా చేయాలన్నది నమ్రత ఆలోచనగా తెలుస్తోంది. కానీ దీనికి మైత్రీ ఓకె అంటుందా? 14 రీల్స్ ఓకె అంటుందా? పైగా ఇద్దరూ కూడా ప్రొడక్షన్ తమకే కావాలని అంటారు. నమ్రత మాత్రం ప్రొఢక్షన్ ను 14రీల్స్ కే ఇవ్వాలని ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. కానీ అంతకన్నా ముందు మైత్రీకి 14 రీల్స్ మధ్య సయోధ్య కుదరాల్సి వుంది.

అందుకే సిద్ శ్రీరామ్ పాడాడు