నాని సినిమా కాన్సెప్ట్ ఏమిటి?

టాక్సీవాలా సినిమా తరువాత దాదాపు ఏడాదిన్నర పట్టింది డైరక్టర్ రాహుల్ కు సినిమా చేతిలోకి రావడానికి. ఆఖరికి సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో ఫిక్స్ అయింది. నాని హీరోగా సినిమా. ఈ సినిమాను…

టాక్సీవాలా సినిమా తరువాత దాదాపు ఏడాదిన్నర పట్టింది డైరక్టర్ రాహుల్ కు సినిమా చేతిలోకి రావడానికి. ఆఖరికి సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో ఫిక్స్ అయింది. నాని హీరోగా సినిమా. ఈ సినిమాను నాని బర్త్ డే సందర్భంగా రేపు అంటే సోమవారం టైటిల్ తో సహా ప్రకటించబోతున్నారు.

ఈ సందర్భంగా ఓ కాన్సెప్ట్ విడియో కూడా రాబోతోంది. ఈ టైటిల్ ను ఈ విడియోతో బాటు ఇస్తేనే జనాలకు థ్రిల్ వుంటుందని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే రేపు ఓ చిన్న విడియో విడుదల చేస్తున్నారు. కానీ విడియో..కాన్సెప్ట్..అంటే జనాలకు మరో విషయం గుర్తుకు వస్తోంది. రాహుల్ చిరకాలంగా ఓ టైమ్ మెషీన్ కాన్సెప్ట్  తో ఓ స్క్రిప్ట్ రెడీ చేసుకుని, కొంత మందికి వినిపించినట్లు తెలుస్తోంది. 

సేమ్ టు సేమ్ ఆదిత్య 369 మాదిరిగా టైమ్ మెషీన్ లో వెనక్కు ముందు వెళ్లే కాన్సెప్ట్ ను రాహుల్ రెడీ చేసారు. కానీ మరి ఇప్పుడు ఆ కాన్సెప్ట్ తో చేయబోతున్నారా?  వేరేదా? అన్నది తెలియాల్సి వుంది. అది కాదు ఇది వేరే అంటున్నాయి నాని సన్నిహిత వర్గాలు. మరి ఆ వేరే అంటే సబ్జెక్ట్ ఏమిటో చూడాలి. 

ఇదిలా వుంటే ఈ సినిమాకు కాస్త వెరైటీ టైటిల్ ప్లాన్ చేస్తన్నట్లు బోగట్టా. శ్యామ్ అనే పదమో మరోటో టైటిల్ లో వుంటుందని తెలుస్తోంది.

అందుకే సిద్ శ్రీరామ్ పాడాడు