తమిళనాడులో నటీనటుల అసోసియేషన్ నడిగర్ సంఘంతో హీరో విశాల్ వివాదం తీవ్ర స్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. సంఘం అధ్యక్షుడు శరత్ కుమార్, తాజగా విశాల్ ను సంఘమ్ నుంచి తొలగించినట్లు వార్తలు అందుతున్నాయి.
ఈ వైఖరిని విశాల్ తీవ్రంగా ఖండిచారు కూడా. తనను సంఘం నుంచి వెళ్లి పోమ్మంటే పోతానని, కానీ సంఘం అధ్యక్షుడు అవలంబిస్తున్న విధి విధానాలు కరెక్ట్ కాదని అంటున్నారు. నిజానికి విశాల్ కు, నడిగర్ సంఘానికి మధ్య పేచీ ఇవ్వాల్టి నిన్నటిది కాదు. గత ఏడాది నుంచి ఏదో ఒకటి నడుస్తోంది. కమల్ విశ్వరూపం వివాదం సమయంలో కూడా విశాల్ నడిగర్ సంఘం పై చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి.
అలాగే సంఘం భవనం విషయంలోనూ విశాల్ గట్టిగా మాట్లాడారు. ఇవన్నీ కలిసి ఇప్పుడు ఈ రేంజ్ కు చేరాయి. తాను సంఘానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడన్నదానికి శరత్ కుమార్ ప్రూఫ్ చూపాలని, అలాగే సంఘ నియమావళికి వ్యతిరేకంగా రాథారవి తదితరులు దుర్భాషలాడడంపై చర్య తీసుకోవాలని విశాల్ డిమాండ్ చేస్తూ ఓ ప్రకటన కూడా విడుదలచేసారు.
న్యాయం అన్నది తనకో మాదిరిగా రాధారవి తదితరులకు ఒక మాదిరిగా వుండకూడదన్నారు. ఈ వివాదం ఎక్కడకు చేరుతుందో మరి.