‘రేసుగుర్రం’ ముందు వరకు అగ్ర శ్రేణి హీరోల తర్వాతి శ్రేణి హీరోగా మాత్రమే పరిగణింపబడ్డ అల్లు అర్జున్ ఇప్పుడు ఏ స్టార్ హీరోకీ తీసిపోడు. ఒకవేళ దీంట్లో ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉంటే ఇప్పుడు తన తాజా చిత్రానికి జరుగుతోన్న బిజినెస్ డీటెయిల్స్ చూసి కళ్లు తెరవచ్చు. అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ల సినిమాని హాట్ కేక్‌లా కొని పారేస్తున్నారు.
ఏ ఏరియాకి బిజినెస్ ఓపెన్ చేసినా కానీ రికార్డ్ రేట్‌కి రైట్స్ అమ్ముడు పోతున్నాయి. ఈమధ్యే సెట్స్ మీదకి వెళ్లిన ఈ చిత్రం బిజినెస్ మేజర్ ఏరియాస్ అన్నిట్లో క్లోజ్ అయిపోయింది. నైజామ్ రైట్స్‌ని దిల్ రాజు పధ్నాలుగు కోట్లకి తీసుకున్నాడనేది అందరికీ షాక్ ఇచ్చింది. రేసుగుర్రం ఇక్కడ పదిహేడు కోట్లకి పైగా షేర్ సాధించి ఉండొచ్చు కానీ పధ్నాలుగు కోట్లు నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ పద్ధతిలో ఇవ్వడమంటే మాటలు కాదు.
త్రివిక్రమ్ కూడా సూపర్ ఫామ్‌లో ఉన్నాడని, వీరిద్దరి గత చిత్రం జులాయి పెద్ద హిట్ అయిందని ఈ చిత్రంపై బయ్యర్స్ హెవీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే ఈ బిజినెస్‌కి అన్ని పార్టీలు హ్యాపీగా ఉండాలంటే బ్లాక్‌బస్టర్ రిజల్ట్ రావాలి. ఒకవేళ సినిమా అంతంత మాత్రమని అనిపిస్తే ఈ రేట్ల మీద బయ్యర్లని గట్టెక్కించే సీన్ బన్నీకి ఉందా అనేది తేలాలి.