Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నాగ్ సినిమా వీళ్లతోనా?

నాగ్ సినిమా వీళ్లతోనా?

పెద్ద సినిమాల హీరో అంటే దాని సీన్ వేరుగా వుంటుంది. టెక్నికల్ టీమ్ మాత్రమే కాదు, కాస్టింగ్ కూడా డిఫరెంట్ గా వుంటుంది. త్రివిక్రమ్ లాంటి  డైరక్టర్ లు అయితే పని మనిషి క్యారెక్టర్ కు కూడా కాస్త నోటెడ్ ఫేస్ లనే తీసుకుంటారు. అలాంటిది పివిపి లాంటి బ్యానర్ నాగార్జునతో సినిమా స్టార్ట్ చేస్తోంది అంటే అందులో ఏయే కాంబినేషన్లు వుంటాయో అన్న ఆసక్తి వుంటుంది.

రావు రమేష్, జగపతి బాబు ఇలా కాస్త బలమైన పేర్లు వినిపిస్తాయేమో అనుకుంటారు. కానీ ఓంకార్ డైరక్షన్ లో తయారవుతున్న ఈ మలయాళీ రీ మేక్ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నలుగురు కుర్ర ఏక్టర్లు వున్నారు. ఈ కుర్రాళ్లు ఎవరు అంటే, షకలకశంకర్, ప్రవీణ్, అశ్విన్ (ఓంకార్ సోదరుడు), వెన్నెల కిషోర్.  

వీళ్లంతా కమెడియన్ల రేంజ్ బ్యాచ్ నే. అశ్విన్ వ్యవహారం అతను నటించిన సినిమాలు చూసిన వారికి తెలిసిందే. సినిమాలో నాగ్ తరువాత కీలకమైన కుర్రాళ్ల పాత్రలు ఇవి. ఆఫ్ కోర్స్ కాస్త కామెడీ టచ్ వుంటుంది అనుకోండి.

రాజ్ తరుణ్, నాగశౌర్య, లాంటి యంగర్ జనరేషన్ హీరోలను తీసుకుంటే సినిమాకు కాస్త మల్టీ స్టార్ లుక్ వచ్చేది కదా? అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?