తెలుగులో తప్ప అన్ని భాషల్లో చేస్తున్నాడు

తమిళ్ లో ధనుష్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. హిందీలో బ్రహ్మాస్త్ర అనే సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. మలయాళంలో మోహన్ లాల్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. కానీ తెలుగులో మాత్రం ఇప్పటివరకు కొత్త సినిమా…

తమిళ్ లో ధనుష్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. హిందీలో బ్రహ్మాస్త్ర అనే సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. మలయాళంలో మోహన్ లాల్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. కానీ తెలుగులో మాత్రం ఇప్పటివరకు కొత్త సినిమా ఎనౌన్స్ చేయలేదు నాగార్జున.

నాగార్జున కెరీర్ లో ఎప్పుడూ ఇలా జరగలేదు. పర భాషా చిత్రాల్లో నటించినా, గెస్ట్ రోల్స్ పోషించినా తనకంటూ కొన్ని సినిమాలు ఉండేవి. రిజల్ట్ సంగతి పక్కనపెడితే ఏదో ఒక సినిమా చేసేవాడు. కానీ ఈసారి ఆశ్చర్యంగా పూర్తిగా పరభాషా చిత్రాలకే పరిమితమైపోయాడు నాగ్.

ప్రస్తుతం నాగార్జున చేతిలో 2 సినిమాలున్నాయి. వీటిలో ఒకటి దాదాపు రెండేళ్లుగా నలుగుతున్న బంగార్రాజు ప్రాజెక్టు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రావాల్సిన సినిమా ఇది. ఎన్ని రిపేర్లు చేసినా, ఎన్ని సీన్లు రాసుకున్నా, ఎన్ని నేపథ్యాలు జోడించినా నాగ్ కు నచ్చడంలేదు. తాజాగా సత్యానంద్ కూడా చేరాడు. కానీ కథ కొలిక్కిరాలేదు.

నాగ్ చేతిలో ఉన్న మరో ప్రాజెక్టు రాహుల్ రవీంద్రన్ సినిమా. చిలసౌ మూవీతో దర్శకుడిగా మారిన ఈ నటుడు, నాగ్ కోసం స్క్రిప్ట్ రెడీచేసే పనిలో ఉన్నాడు. ఇది కూడా ఫైనలైజ్ కాలేదు. ఇలా తనవద్ద ఉన్న ఇద్దరు దర్శకులు కథలు రెడీ చేయకపోవడంతో అనూహ్యంగా ఖాళీ అయిపోయాడు నాగ్. అయితే ఈ దీపావళికి నాగ్ కొత్త సినిమా ఎనౌన్స్ చేస్తాడనే ప్రచారం సాగుతోంది. అది ఏ సినిమానో చూడాలి.

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి