పడిపోయిన బిచ్చగాడి మార్కెట్

బిచ్చగాడు సినిమాతో హీరో విజయ్ ఆంటోనీ తెలుగువాళ్లకు దగ్గరైపోయాడు. ఆయన తన సినిమాలు అన్నింటికీ తెలుగులో ప్రమోషన్ వగైరాలు దగ్గర వుండి చూసుకుంటాడు. దాంతో ఆయన సినిమాలు అన్నీ వరుసపెట్టి తెలుగులో బాగానే విడుదలయ్యాయి.…

బిచ్చగాడు సినిమాతో హీరో విజయ్ ఆంటోనీ తెలుగువాళ్లకు దగ్గరైపోయాడు. ఆయన తన సినిమాలు అన్నింటికీ తెలుగులో ప్రమోషన్ వగైరాలు దగ్గర వుండి చూసుకుంటాడు. దాంతో ఆయన సినిమాలు అన్నీ వరుసపెట్టి తెలుగులో బాగానే విడుదలయ్యాయి. కానీ ఏ ఒక్క సినిమా కూడా సక్సెస్ అనిపించుకోలేకపోయింది.

దీంతో తెలుగులో విజయ్ ఆంటోనీ మార్కెట్ పూర్తిగా పడిపోయినట్లు కనిపిస్తోంది. ఎంత పడిపోయిందీ అంటే, ఇప్పుడు లేటెస్ట్ సినిమా రోషగాడును తెలుగు హక్కులు జస్ట్ కోటిన్నర మాత్రమేనంట. అంటే ఉభయ తెలుగు రాష్ట్రాలకు రోషగాడు ఫస్ట్ కాపీ కోటిన్నరకు రెడీ అన్నమాట.

అయితే కోటిన్నరకు బేరం చేసిన తెలుగు జనాలు, ఆ రేటుకే శాటిలైట్ కూడా కలిపి ఇవ్వమని అడుగుతున్నారట. శాటిలైట్ కాకుండా కోటిన్నర అనడంతో వదిలేసి వచ్చారట. శాటిలైట్ తో అయితే కోటిన్నరకు ఒకే కానీ ఓన్లీ థియేటర్ రైట్స్ అయితే కోటిన్నరకు కిట్టుబాటు కాదని బేరం కోసం డిడిలు పట్టుకువెళ్లిన వారు వెనక్కు చక్కా వచ్చారట.

కోటిన్నర అంటే కనీసం మరో 50 లక్షలు అయినా పబ్లిసిటీకి పెట్టాలని కిట్టుబాటు కాదని అంటున్నారు. పాపం, విజయ్ ఆంటోనీ మార్కెట్ అంత పడిపోయిందా?

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి