రాజమౌళి కొడుకు ‘ఆకాశవాణి’

దిగ్దర్శకుడు రాజమౌళి కొడుకు కార్తికేయది ఒక వ్యవహారం కాదు. చాలా వ్యాపారాలు, చాలా వ్యాపకాలు. ఆ మధ్య చైతన్య 'యుద్ధం శరణం' నిర్మాణ బాధ్యతలు కూడా మోసారు. ఇప్పుడు ఆయనే నిర్మాతగా మారిపోయారు. ఆకాశవాణి…

దిగ్దర్శకుడు రాజమౌళి కొడుకు కార్తికేయది ఒక వ్యవహారం కాదు. చాలా వ్యాపారాలు, చాలా వ్యాపకాలు. ఆ మధ్య చైతన్య 'యుద్ధం శరణం' నిర్మాణ బాధ్యతలు కూడా మోసారు. ఇప్పుడు ఆయనే నిర్మాతగా మారిపోయారు. ఆకాశవాణి అనే పేరుతో సినిమా నిర్మిస్తున్నారు. రాజమౌళి దగ్గర చిరకాలం పనిచేసిన ఓ అసోసియేట్ డైరక్షన్లో సినిమా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా కాస్టింగ్, నిర్మాణ వ్యవహారాలు అన్నీ డార్క్ లో వుంచి సైలంట్ గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది.

మొత్తం పూర్తయిన తరువాత ఈ సినిమా విషయాలు బయటకు తెస్తారని వినికిడి. కార్తికేయ గతంలో డైరక్షన్ డిపార్ట్ మెంట్ లో కూడా పనిచేసారు. బాహుబలి టైమ్ లో రాజమౌళికి సహాయంగా వున్నారు. ఇప్పుడు ఆ అనుభవంతోనే మాంచి కథను ఎంచుకుని, డైరక్టర్ సాయం తీసుకుని, సినిమాను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.

సినిమా ఎప్పుడు రెడీ అయినా, రాజమౌళి కొడుకు సినిమా అంటే ఆటోమెటిక్ గా క్రేజ్, బజ్ వస్తుంది. అందువల్ల ఇప్పట్లో వివరాలు బయటకు చెప్పకపోయినా నష్టంలేదు.

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి