నాగ్ ఫుల్ ఛేంజ్ ఓవర్?

నాగార్జున మీద గతంలో ఓ అపప్రధ వుండేది. ఆయన తన కొడుకులు ఇద్దరినీ సరిగ్గా లాంచ్ చేయలేదని, నాగ్ చైతన్యను దిల్ రాజు చేతిలో పెట్టి, అఖిల్ ను అతని స్నేహ బృందానికి వదిలేసి…

నాగార్జున మీద గతంలో ఓ అపప్రధ వుండేది. ఆయన తన కొడుకులు ఇద్దరినీ సరిగ్గా లాంచ్ చేయలేదని, నాగ్ చైతన్యను దిల్ రాజు చేతిలో పెట్టి, అఖిల్ ను అతని స్నేహ బృందానికి వదిలేసి తప్పు చేసారని. కానీ ఇప్పుడు మొత్తం సీన్ మారిపోయింది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే నాగ్ మారిపోయాడు. నాగ్ చైతన్య మార్కెట్ ఎంత వుంది అన్నది ఇంకా స్టడీ కాలేదు మంచి సినిమా పడితే పాతిక కోట్ల మేరకు వుంటుందని ఓ అయిడియా వుంది.

అందువల్ల రిస్క్ అయితే అయిందని రారండోయ్ సినిమా కోసం 21 కోట్లు ఖర్చు చేసాడు నాగ్. మనం సినిమాకు కూడా అంతకు  మించి చాలానే స్పెండ్ చేసాడు కానీ, అది మల్టీ స్టారర్ కింద లెక్క. ఎప్పుడైతే డబ్బుకు వెనుకాడ కుండా, సినిమా పై ఫుల్ కేర్ తీసుకోవడం ప్రారంభించాడో, అక్కడి నుంచి చెప్పి మరీ నాగ్ హిట్ లు కొడుతున్నాడు. మనం, సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్..సినిమాల ఫంక్షన్లలో 'మనం కొడుతున్నాం' అని చెప్పి మరీ హడావుడి చేసాడు.

ఇక అఖిల్ సినిమా కోసం కూడా నాగ్ చాలా భారీగా ఖర్చు చేస్తున్నాడట. అఖిల్ కు ఒక హిట్ ఇస్తే, ఇక తనకు ఫుల్ హ్యాపీ అని అంటున్నాడట నాగ్.

ఇదంతా చూస్తుంటే పిల్లల కోసం నాగ్ పూర్తిగా మరిపోయినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఇంతకు ముందు నాగ్ రిస్క్ తీసుకోవడం లేదా, కొడుతున్నాం, అనే చాలెంజ్ లు చేసేవాడు కాదు. ఇప్పుడు రిస్క్ తీసుకుంటున్నాడు. కేర్ తీసుకుంటున్నాడు. చెప్పి హిట్ లు కొడుతున్నాడు.