నాగ్ జోక్యమే వికటించిందా?

వినాయక్ సినిమా చేస్తున్నాడంటే మినిమమ్ గ్యారంటీ వుంటుంది. అదో భరోసా. అలా అని వినాయక్ అద్భుతాలు ఏమీ చేయడు..కామన్ ఆడియన్ కు ఏమి కావాలో అది చూసుకుంటాడంతే. అది అదుర్స్ అయినా, అల్లుడు శీను…

వినాయక్ సినిమా చేస్తున్నాడంటే మినిమమ్ గ్యారంటీ వుంటుంది. అదో భరోసా. అలా అని వినాయక్ అద్భుతాలు ఏమీ చేయడు..కామన్ ఆడియన్ కు ఏమి కావాలో అది చూసుకుంటాడంతే. అది అదుర్స్ అయినా, అల్లుడు శీను అయినా. అయితే అఖిల్ సినిమా విషయంలో మాత్రం అంత ప్రతిభ చూపించకలేకపోయాడు. సినిమా చూస్తే, తెలియని లోపం అన్నట్లు కామన్ ఆడియన్ కూడా ఫీలయ్యాడు. దీనికి కారణం..? సినిమాలో రెండు పార్శ్యాలు..ఒకటి రొటీన్ లవ్ ట్రాక్. రెండవది ప్రధానమైన జువా ట్రాక్. ఇప్పుడు సినిమాలో ఈ లవ్ ట్రాక్ చూస్తే, ఫార్ములా ప్రకారం ఓకె అనిపిస్తుంది. 

కానీ జువా ట్రాక్ చూస్తే ఏదో వుండాలి కాబట్టి ఆ మాత్రం వున్నట్లు అనిపిస్తుంది. ఆ స్టోరీ లైన్ మొత్తం కట్టె కొట్టే తెచ్చే అన్నట్లువుంటుంది. నిజానికి ఈ ట్రాక్ ను కూడా వినాయక్ కాస్త వివరంగానే చిత్రీకరించినట్లు టాలీవుడ్ వర్గాల బోగట్టా. అయితే సినిమా ఫైనల్ ప్రొడక్ట్ ను, లెంగ్త్ ను చూసిన అఖిల్ డాడ్ నాగ్ కత్తెరను తన చేతిలోకి తీసుకున్నట్లు వినికిడి. ఆయన కాస్త ఎడా పెడా కట్ చేసినట్లు, ఆ కత్తెర కాస్తా ఈ జువా ఎపిసోడ్ మీద పడినట్లు తెలుస్తోంది. దాంతొ సినిమాలో రెండు పార్శ్వాలకు బ్యాలెన్స్ కుదరలేదు.

వాతలు పెట్టుకున్నాడా?

వినాయక్ వైనం తెలిసిన వారు మరో విధంగా కామెంట్ చేస్తున్నారు. మగధీర చూసి, అలాంటి సినిమా తీయాలని బద్రీనాధ్ తీసాడని. అది వికటించిందని. ఇప్పుడు బహుబలి గ్రాఫిక్స్ చూసి, అలాంటి సినిమా తీయాలని అఖిల్ చేసాడని అంటున్నారు. వినాయక్ కు రెగ్యులర్ ఫార్మాట్ సినిమా లు అందించే సత్తా వుంది కానీ, ఇలా అవుటాఫ్ ది బాక్స్ అయిడియాలను సరిగ్గా ప్రొజెక్ట్ చేయలేడని అంటున్నారు. అల్లుడు శీను లాంటి రెగ్యులర్ ఫార్మాట్ సినిమా చేసినా, అఖిల్ డ్యాన్స్ లు, ఫైట్ల స్కిల్స్ కు ఓకే అయిపోయేదని, ఓ లెవెల్ సినిమా వుండాలన్న అయిడియాతో ఇలా చేసారని కామెంట్లు వినిపిస్తున్నాయి.