నిర్మాత రామ్ మోహన్ సినిమా లో నాగ్ ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి, ఆ సినిమా పూర్తిగా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో నడిచే సంగతి అందిరకీ తెలిసిందే. ఈ సినిమాకు కళ్యాణ్ అనే కొత్త డైరక్టర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలి కాలంలో నాగ్ సినిమాకు కొత్త దర్శకుడు దర్శకత్వం వహించడం ఇదే. దీని వెనుక చిన్న ఆసక్తికరమైన వ్వవహారం నడిచిందట.
సరైన డైరక్టర్, కథ కోసం వెదుకుతున్న నాగ్ కు రామ్ మోహన్ కథ చెప్పి, తానే డైరక్షన్ కూడా చేస్తానన్నాడట. అయితే డైరక్షన్ వేరేవాళ్లకి ఇద్దామని నాగ్ ఒప్పించాడట. ఎవరు దర్శకుడు అన్న ప్రశ్న తలెత్తింది. వెదుకలాట ప్రారంభమైంది,. అదే సమయంలో చిరంజీవి మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి వచ్చారు. గ్యాప్ లో పిచ్చాపాటీ మాట్లాడుకుంటుంటే, ఈ సంగతి డిస్కషన్ కు వచ్చింది.
దాంతో చిరంజీవి తాను ఓ కొత్త కుర్రాడిని పంపిస్తానని చెప్పి, ఈ కళ్యాణ్ ను పంపించాడట. ఇంతకీ ఈ కళ్యాణ్ ఎవరో కాదని, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు అండగా వుండి, తరువాత ఎమ్మెల్యేగా మారిన ఈనాడు మాజీ జర్నలిస్టు కన్నబాబు సోదరుడట. గడచిన రెండేళ్లుగా ఈ కళ్యాణ్ మెగా క్యాంప్ లో అవకాశం కోసం చూస్తున్నాడు. అది రాలేదు. కానీ చిరు రికమెండేషన్ తో నాగ్ ను డైరెక్ట్ చేసే అవకాశం మాత్రం వచ్చింది. టైమ్ అంటే అదీ మరి.