Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'పవర్' పై ఎందుకీ ప్రచారం?

'పవర్' పై ఎందుకీ ప్రచారం?

నిన్నటి దాకా రవితేజ పవర్ సినిమా గురించి ఒక్క నెగిటివ్ మాట లేదు. సినిమా సూపర్..మాంచి ఎనర్జిటిక్ ఎంటర్ టైనర్..మాస్ మూవీ అనే మాటలే తప్ప.  ఇదే విషయాన్ని నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ కూడా చాలా ఆనందంగా చెప్పారు తన మీడియా సమావేశంలో. కానీ ఉన్నట్లుండి బుధవారం ఇండస్ట్రీలో పవర్ సినిమాకు సంబంధించి నెగిటివ్ టాక్ ప్రారంభమైంది. పవర్ లెంగ్త్ ఎక్కువైందట కదా..సెకండాఫ్ ట్రిమ్ చేసారట..కాదు కాదు క్లయిమాక్స్ వీక్ అట..అది కాదు. అసలు సినిమా అంతా రవితేజే డైరక్ట్ చేసేసాడట..ఇలా రకరకాల వార్తలు వినిపించడం ప్రారంభించాయి. ఒకరద్దిరు సినిమా పర్సనాలిటీలకు వారికి తెలిసిన వారి నుంచి ఈ మేరకు ఎస్ ఎమ్ ఎస్ లు కూడా వచ్చాయని వినికిడి. వాటిని చూసి వారు ఎంక్వయిరీలు చేయడం వంటి హడావుడి తప్పలేదు. 

చిత్రంగా రవితేజ బలుపు ముందు కూడా ఇలాగే ప్రచారం సాగింది. గోపీచంద్ మలినేని డైరక్షన్ చేయడం లేదని,రవితేజ, బాబి చేసారని. మరి ఇప్పుడు అదే బాబి డైరక్షన్ చేస్తే, కాదు రవితేజ చేసాడని పుకార్లు. 

అసలే ఇండస్ట్రీ చాలా కష్టంలో వుంది. కొత్త సినిమాలు ప్రారంభం కావడమే గగనంగా వుంది. పెద్ద పెద్ సంస్థలన్నీ చేతులు ముడుచుకు కూర్చున్నాయి. పక్కరాష్ట్రం నుంచి వచ్చినవారిని కూడా ఇలా బెదరగొట్టి పంపేస్తే, ఇక అంతే సంగతులు. 

ఇదిలా వుంటే ఈ వదంతులు పుట్టడానికి యూనిట్ కూడా కాస్త కారణమైందని తెలుస్తోంది. ఈ రోజు యూనిట్ లోకీలక సభ్యులు సినిమా చూసారు. సినిమా చూసిన వారు వెంటనే వెళ్లిపోక, ఓ గంట అక్కడే వుండి ముచ్చట్లాడుకున్నారు. అది చూసిన వారు ఇదేదో సినిమాకు అతుకులు, కటింగ్ లు చేస్తున్నారనుకుని, ఆ నోటా ఈనోటా ప్రచారం సాగించినట్లు తెలుస్తోంది.

ఇదే విషయమై డైరక్టర్ బాబిని 'గ్రేట్ ఆంధ్ర' ప్రశ్నిస్తే, తాను తిరుపతికి వచ్చానని తెలిపారు. సినిమా అద్భుతంగా వచ్చిందని, ఇక ఈ చివరి నిమిషంలో అలా చెప్పడం అనవసరమని, సినిమా విడుదలైన తరువాత ఇలాంటి వదంతులు అన్నీ ఆగిపోతాయని, జనం హాయిగా కావాల్సినంత వినోదం పొందుతారని అన్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?