ఆర్జీవీ. విష్ణు కాంబినేషన్ లో వస్తున్న సినిమా అనుక్షణం. తన కెరియర్ లో ఓ డిఫరెంట్ సినిమా అని హీరో విష్ణు అంటున్నారు. ఆయన తన సినిమా మరో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న సందర్భంగా 'గ్రేట్ ఆంద్ర'తో ఆయన చిట్ చాట్.
ఏమిటి అనుక్షణం ప్రత్యేకత?
ఇది ఓ ఢిఫరెంట్ మూవీ..కెవలం గంటన్నర నిడివి. హీరోయిన్ లేదు.. సినిమా గ్రిప్పిగ్ గా సాగుతుంది. రామ్ గోపాల్ వర్మ టేకింగ్ స్టయిల్ లో వుంటుంది.
మిడిల్ రేంజ్ హీరో నుంచి రౌడీ, అనుక్షణం, ఇలా చిన్న బడ్జెట్ సినిమాలకు వచ్చారెందుకు?
ఇవ్వాళ ఇండస్ట్రీ పరిస్థితి ఎలా వుంది చెప్చండి. అసలు ఫైనాన్షియర్లు ఎక్కడున్నారు? ఎవరు ఇస్తున్నారు, ఇవ్వాలంటేనే ముందు వెనుక ఆడుతున్నారు.
అంతేనే ఇదే సేఫ్ జోన్ అని భావిస్తున్నారా?
సేఫ్ జోన్ అని చేయడం లేదు. కానీ ఇది సేఫ్ జోనే. 20 కోట్ల సినిమా తీసే బదులు అయిదారు సినిమాలు తీయచ్చు..పది మందికి పని దొరకుతుంది.
కానీ మాస్, ఎంటర్ టైన్ మెంట్, యాక్షన్ కామెడీ ఇవన్నీ ఈ జోన్ లో సెట్ కావడం కష్టం కదా.
అన్నీ సెట్ కావు. అవీ చేస్తాను. ఇవీ చేస్తాను.
అన్నీ చేస్తారు. అన్నీ స్వంత బ్యానర్లో నేనా
లేదే..ఈ ఏడాది రెండు సినిమాలు బయటి బ్యానర్లో చేసాను.
అవి మీ దగ్గరివారివేగా..
అవుననుకోండి. అయినా ఎవరైనా మంచి స్క్రిప్ట్ తో వచ్చి చేయమంటే, నేనేమన్నా చేయనని అంటానా..? ఇప్పుడు ఎర్రబస్సు బయటి బ్యానరేగా.
మీ ఫాదర్ దగ్గరకు రావడానికి చాలా మంది జంకుతారు. ఆర్జీవీతో పని చేయడానికి మరికొందరు జంకుతారు.ఈ ఇద్దరికీ ఎలా కుదిరింది జోడీ. ముఖ్యంగా ఇప్పుడు రామ్ మీ ఫ్యామిలీకి బాగా అటాచ్ అయినట్లున్నారు
రామ్ గోపాల్ వర్మ మంచి టెక్నీషియన్. పైగా నిర్మాతలకు పాకెట్ ఫ్రెండ్లీ డైరక్టర్. చాలా కొత్తగా ఆలోచిస్తారు. అందుకే మాకు నప్పింది.
సినిమా వేలం పాట అయిడియా ఎలా వుంది?
బ్రహ్మాండంగా వుంది. కరెంటు తీగ కూడా వేలం వేస్తాం. దాసరి గారు ఎర్రబస్సు కూడా అలాగే చేస్తామంటున్నారు.
థియేటర్ల సమస్య రాదా..
లేదు. ముందే పక్కాగా అన్నీ అగ్రిమెంట్ చేసుకుంటున్నాం.
మీకు లాభం ఏ మేరకు కనిపిస్తోంది
యాభై పైసల్లో సినిమా తీసాం అనుకుంటే, నలభై పైసలు వచ్చేసింది. పది పైసలకు సరిపడా థియేటర్లు మిగిలే వున్నాయి. మాకే కాదు, కొన్నవాళ్లకి కూడా మొదటి రెండు రోజుల కలెక్షన్లతోనే పెట్టుబడి వచ్చేస్తుంది.
పేమెంట్ లు ఎలా ఇస్తారు
అంతా బ్యాంకు ద్వారానే. బ్లాక్ అన్నదే లేదు. అంతా వైట్. వచ్చిన వసూళ్లలో థియేటర్ రెంట్, ఖర్చులు పోను, ప్రతి పైసా కొనుక్కున్నవారికే.
ఎప్పుడు ఇస్తారు?
నెల తరువాత. ఎందుకంటే సహజంగా థియేటర్ దగ్గర నుంచి రావడానికి నెల పడుతుంది కదా. అంతవరకు రోజు వారీ లెక్కలు అన్నీ వారి మెయిల్ ఐడి కి వెళ్లిపోతుంటాయి.
అంతా క్రిస్టల్ క్లియర్ గా వుంటేనే ఈ థియరీ కాస్తా ప్రాక్టికల్ గా వర్కవుట్ అవుతుందేమో.
అందులో సందేహం లేదు. చాలా పారదర్శకంగా వుంటాం.
మళ్లీ పెద్ద సినిమా ఎప్పుడు?
ఓ సినిమా రీమేక్ రైట్స్ కొన్నాను. వచ్చేనెల ప్రారంభిస్తాం.
ఈ ఏడాది నాలుగు సినిమాలు చేయగలిగినట్లున్నారు.
అవునండీ..ఆనందంగా వుంది.వచ్చే ఏడాది కూడా మూడు గ్యారంటీగా వుంటాయి.
మరోపక్క నూరేళ్ల సినిమా డాక్యుమెంటరీ అంటున్నారు
నాన్నగారి కల అది. నూరేళ్ల తెలుగు సినిమా మీద డాక్యుమెంటరీ ఎటువంటి పక్షపాతం లేకుండా చేస్తున్నాం
దీనికి చాలా రీసెర్చి అవసరం కదా?
అవును. పరుచూరి గోపాలకృష్ణ గారు, విఎన్ ఆదిత్య ఆ పని మీదే వున్నారు. సంఘటనలు కాంట్రావర్సీలు కూడా వుంటాయి
తెలుగు పరిశ్రమలో ఏ కాంట్రావర్సీలు?
ఏవైనా..ఆ మధ్య జరిగిన వజ్రోత్సవం, అన్నీ.
అనవసరపు వివాదాలేమో?
ఐ డోండ్ కేర్. అసలు నిజాలు జనాలకు తెలియద్దూ. ఒకప్పటి సూపర్ స్టార్ చిత్తూరు నాగయ్య విగ్రహం చెన్నయ్ లో వుంది. ఈ రోజుకు ఇక్కడ లేదు. ఇది తెలియాలి కదా.
ఎక్కువ తక్కువలు వుంటాయా?
ఏమీ వుండవు. పరిశ్రమలోకి ముందు వచ్చిన వారు ముందు. ఎవరి వైనం వారిదే అంతే.
ఇంత ఖర్చు ఏ లాభం లేకుండా ఎలా?
సింపుల్..నాన్నగారి కోసం అంతే.
గుడ్..థాంక్యూ
థాంక్యూ
చాణక్య