నాగ్‌, మహేష్‌.. బుస్సేనా?

నాగార్జున, మహేష్‌బాబు కాంబినేషన్‌లో ఒక సినిమా వస్తుందనే వార్త బాగా ప్రచారమవుతోంది. ఇది ఎక్కడ పుట్టిందనేది తెలీదు కానీ ఇప్పుడు సోషల్‌ మీడియాతో పాటు కొన్ని వెబ్‌సైట్స్‌లో కూడా ఈ న్యూస్‌ కనిపిస్తోంది. అయితే…

నాగార్జున, మహేష్‌బాబు కాంబినేషన్‌లో ఒక సినిమా వస్తుందనే వార్త బాగా ప్రచారమవుతోంది. ఇది ఎక్కడ పుట్టిందనేది తెలీదు కానీ ఇప్పుడు సోషల్‌ మీడియాతో పాటు కొన్ని వెబ్‌సైట్స్‌లో కూడా ఈ న్యూస్‌ కనిపిస్తోంది. అయితే ఈ వార్తని మహేష్‌ సన్నిహితులు ఖండిస్తున్నారు. అసలు డిస్కషన్‌లోకి కూడా రాలేదని అంటున్నారు. 

మహేష్‌బాబు ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది జూన్‌, జులై వరకు కూడా మహేష్‌ డేట్స్‌ ఖాళీ లేవు. తనతో పని చేద్దామని చూస్తున్న దర్శకుల క్యూ పెరిగిపోతోంది. తను ఓకే చేసి పెట్టిన కథలు కూడా పెరిగిపోతున్నాయి. అన్నిటికీ టైమ్‌ ఇవ్వడానికే మహేష్‌కి టైమ్‌ సరిపోవట్లేదు. ఇలాంటి టైమ్‌లో ఇంకో మల్టీస్టారర్‌ చేయడానికి మహేష్‌ తీరిక చేసుకుంటాడా?

అన్నిటికీ మించి ఈ కాంబినేషన్‌లో సినిమా చేస్తాడని అంటున్న శ్రీకాంత్‌ అడ్డాల ఇప్పటికే మెగా హీరో వరుణ్‌ తేజ్‌ని పరిచయం చేసే చిత్రం కోసం కథ సిద్ధం చేసే పని మీద బిజీగా ఉన్నాడు. అతని సినిమా పూర్తి కావడానికి కూడా ఏడాది సమయం పడుతుంది కాబట్టి అసలు ఈ నాగ్‌, మహేష్‌ కాంబినేషన్‌ గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం కూడా టూ ఎర్లీ అవుతుంది.