రచయిత చిన్ని కృష్ణ చిరంజీవి కోసం కథ రాస్తున్నాడట. ఇటీవల పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యు లో చిన్ని కృష్ణ చెప్పిన మాట ఇది. చిరంజీవి కోసం కథ రాస్తున్నాడు సరే ఇంతకు రాయమని చిన్ని కృష్ణ ను పురమాయించింది ఎవరు. రాయమని చిరంజీవి చెప్పాడా? సినిమా చేస్తానని చిన్ని కృష్ణ కు చిరంజీవి ఏమైనా హామీ ఇచ్చాడా? అని ఫిలిం నగర్ లో విపరీతంగా చర్చ జరుగుతోంది.
చిరంజీవి అసలు సినిమా చేసే పరిస్థితి కనిపించడం లేదు అని చిరు ఫ్యాన్స్ మొత్తుకుంటుంటే చిన్ని కృష్ణ ఏమో కథ రెడీ చేస్తున్నా అంటున్నాడు. మరి ఎప్పుడో చిరంజీవి కోసం కథ రెడీ చేసి ఆయన్ని దాదాపుగా ఒప్పించిన చిన్ని కృష్ణ గురువులు పరుచూరి బ్రదర్స్ ఎక్కడికి వెళ్ళాలి. అసలు ఉలు లేదు సోలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఉంది చిన్ని కృష్ణ కథ అని సినిమా పెద్దలు వెటకారంగా నవ్వుకుంటున్నారు.
బద్రినాథ్ ఫ్లాప్ తో ఇంతవరకు మీడియా ముందుకు రాని చిన్ని కృష్ణ ఈ మధ్య మీడియాలో కనిపించి చిరంజీవి గురించి కథ రాస్తున్నాను అని చెప్పడం తో మిగతా హీరోలు అందరు తమకు మీ కథలేమి వద్దులెండి అని అంటున్నారట.