సినిమా అన్ని రకాల జోనర్లతో కళకళలాడి, అందంగా తయారు కావాలంటే ఒక్కరి వల్లే కాదు. ఇద్దరు ముగ్గురు రైటర్లు కలిసి వండాల్సిందే. లేటెస్ట్ నాగ్-ప్రవీణ్ సత్తారు సినిమాకు అదే జరుగుతోంది.
ప్రవీణ్ సత్తారు అంతా యాక్షన్ టైపు సినిమా ప్లాన్ చేసారు. కానీ వైల్డ్ డాగ్ ఫలితం చూసాక, నాగ్ కు తెలిసి వచ్చింది. ఈ వయసులో తను ఫైట్లు చేస్తే జనం పక్కన పెడతారని. అందుకే ఫ్యామిలీ, ఫన్, యాక్షన్ ఇవన్నీ మిక్స్ చేయాలని డిసైడ్ అయిపోయారు.
దాంతో ప్రాజెక్టులోకి రచయిత అబ్బూరి రవి కూడా వచ్చి చేరారు. స్క్రిప్ట్ కు అబ్బూరి రవి చేసిన మార్పులు, చేర్పులు నాగ్ కు నచ్చేసాయని బోగట్టా. ఆగిపోతుందనుకున్న ప్రాజెక్టు ఆ విధంగా ముందుకు సాగడానికి మార్గం సుగమం అయింది.
గతంలో కూడా అబ్బూరి రవి అటు యాక్షన్ ఇటు ఫ్యామిలీ, ఫన్ టచ్ వున్న సినిమాలకు పని చేసి శభాష్ అనిపించుకున్నారు. అదే ఇప్పుడు ఈ ప్రాజెక్టులోకి ఆయనను తీసుకువచ్చి వుంటుంది.