హీరో రామ్ కు కథ చెప్పి ఒప్పించడం అంత వీజీ కాదు. అలాంటిది రామ్ చేత వావ్ అనే ట్వీట్ వేయించాడు దర్శకుడు లింగుస్వామి. మరి ఏం లైన్ చెప్పాడా? కథ చెప్పాడా? అన్నది కాస్త ఆసక్తి కరం. అయితే ఇండస్ట్రీలో ఓ ఇంట్రస్టింగ్ గ్యాసిప్ వినిపిస్తోంది.
రామ్ కన్నా ముందుగా లింగుస్వామి తెలుగులో చాలా మంది హీరోల డేట్ ల కోసం ట్రయ్ చేసారు. అందులో భాగంగా హీరో నితిన్ కు ఓ లైన్ చెప్పారు. సరే ఓకె అన్నారు.
హీరో రెమ్యూనిరేషన్ లేకుండా 20 కోట్ల బడ్జెట్ లో ఫస్ట్ కాపీ తీయడానికి మాటలు కూడా జరిగాయి. కానీ జ్ఞాన్ వేల్ రాజా లిటిగేషన్ వుంది అని తెలియడంతోనూ, పెద్ద మొత్తం అడ్వాన్స్ ఇవ్వాలని లింగుస్వామి అడగడంతోనూ ఆ ప్రాజెక్టు వెనక్కు వెళ్లిపోయింది.
అప్పుడు నితిన్ కు చెప్పిన లైన్ నే మళ్లీ రామ్ కు చెప్పాడా? అన్నది ఓ డవుట్. నితిన్ కు చెప్పిన కథలో హీరోయిన్ కు కాస్త కీలకపాత్ర వుంటుంది. హీరోయిన్ కు కష్టం ఆమె స్థలం కబ్జాకు గురికావడం వంటిది ఏదో జరిగితే, హీరో వెళ్లి అండగా నిల్చుంటాడు.
నిజానికి ఇలాంటి లైన్ తో మన హీరోలంతా దాదాపు సినిమాలు చేసేసారు. మరి దానికి లింగుస్వామి స్టయిల్ ట్రీట్ మెంట్ వుండే వుంటుంది. లేదా వేరే లైన్ ఏదో చెప్పారేమో తెలియదు?