Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నాగబాబుకు బాగానే గిట్టుబాటు అయింది

నాగబాబుకు బాగానే గిట్టుబాటు అయింది

సినిమా హిట్ అయితే హీరోలు రెమ్యూనరేషన్ పెంచడం మామూలే. అలాంటి అవకాశం ఇప్పుడు నాగబాబుకు కూడా వచ్చింది. జబర్దస్త్ లాంటి సూపర్ హిట్ కార్యక్రమం నుంచి వస్తున్న నాగబాబుకు, జీ తెలుగు ఛానెల్ బ్రహ్మరథం పట్టింది. అతడికి స్టార్ హీరోకు ఇచ్చే ట్రీట్ మెంట్ (కాస్ట్ లీ కారవాన్) ఇవ్వడంతో పాటు పారితోషికం కూడా పెంచింది. తాజా సమాచారం ప్రకారం.. జీ తెలుగులో కార్యక్రమాల కోసం నాగబాబుకు నెలకు 30 లక్షల రూపాయల వరకు ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది.

జబర్దస్త్ లో నాగబాబుకు నెలకు 20 లక్షల రూపాయల వరకు ముట్టేది. కార్యక్రమం ప్రారంభమైనప్పట్నుంచి ఆయన బయటకు వచ్చేంత వరకు ఆయన గౌరవ వేతనం ఇంతే. జీ తెలుగులో మాత్రం నియమ-నిబంధనలు మారాయి. అన్ని రకాల అలవెన్సులతో  కలుపుకొని ఆయనకు 30 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నారు. అయితే ఆయన కేవలం ఒక కార్యక్రమానికి మాత్రమే పరిమితం కారు.

ఛానెల్ అవసరం అనుకున్నప్పుడు మిగతా కార్యక్రమాలకు కూడా ఆయన్ను ఆహ్వానిస్తుంది. ఆ ఆహ్వానం మేరకు ఆయన సదరు కార్యక్రమానికి ప్రత్యేక  అతిథిగా రావాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇప్పటికే ఓ కార్యక్రమంలో నాగబాబును వాడేసింది ఛానెల్. అంతేకాదు.. కేవలం 30 లక్షలకే పరిమితమైపోకుండా.. రెండేళ్లకు ఒకసారి పేమెంట్ ను సవరించేలా అగ్రిమెంట్ రాసుకున్నారు.

కార్పొరేట్ ఛానెల్ కాబట్టి పేమెంట్ తో పాటు కండిషన్స్ కూడా పక్కాగానే ఉంటాయి. ఇందులో భాగంగా మరే ఇతర టెలివిజన్ ఛానెల్ లో నాగబాబు కనిపించడానికి వీల్లేదు. నాగబాబు జడ్జిగా అదిరింది అనే కార్యక్రమం రేపట్నుంచి జీ తెలుగులో ప్రసారం అవుతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?