పూరి జగన్నాధ్ తో తన కుమారుడు వరుణ్ తేజ సినిమాకు నాగబాబు సై అనడానికి వెనుక, మరో ఆప్షన్ లేకపోవడమే కారణం అని టాలీవుడ్ గుసగుసల సారాంశం. ఇప్పటికి వరుణ్ ఒక్క సినిమా చేసాడు. అది పక్కా క్లాస్. ఇప్పుడు క్రిష్ తో మరో సినిమా చేస్తున్నాడు. అది కూడా అలాగే వుంటుదనడంలో సందేహం లేదు.
ఇక ఒక్క సినిమా అయినా మాస్ సినిమా చేయకుంటే మెగా హీరోలకు కరెక్ట్ కాదు. కానీ మాస్ సినిమా చేయగల వారు ఎవరు? బోయపాటి, శ్రీను వైట్ల, వివి వినాయక్, ఇలా టాప్ లైన్ ఆర్డర్ డైరక్టర్లు వరుణ్ తేజ దగ్గరకు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. పూరి వైనం అలా కాదు. మెగాస్టార్ తోనూ రెడీ..సంపూర్ణేష్ బాబుతోనూ రెడీ.
పైగా పూరితో సినిమా అంటే ఎలా వున్నా, క్రేజ్ అయితే వుంటుంది. అందుకే నాగబాబు ఓకె అన్నాడని వినికిడి. అయినా ఇంకా అది ప్రారంభం అయ్యేవరకు వెయిట్ అండ్ సీ అన్న టాక్ కూడా వుంది. ఎందుకంటే నితిన్ కోసం రెడీ చేసిన సబ్జెక్ట్ అది. వరుణ్ కు సరిపోతుందా..లేదా మార్పులు చేస్తారా అన్నది చూడాలి. ఆగస్టు మొదటి వారంలో సెట్ మీదకు వెళ్తామంటున్నారు.