మెగా కాంపౌండ్ లో అంత సులువుగా సంతృప్తి అనేది వుండదు. సాన పడుతూనే వుంటారు స్క్రిప్ట్ ను. ఇప్పుడు శ్రీనువైట్ల సినిమా టాకీ చకచకా షూటింగ్ జరిగిపోతోంది. మరోపక్క ఇంకా తీయాల్సిన కొన్ని సీన్లకు సంబంధించి కోన వెంకట్ టీమ్ డైలాగులు మరో వెర్షన్ రెడీ చేసారట.
కోన వెంకట్ వాటిపై ఓ లుక్ వేసి, ఓకె అంటే అప్పుడు ఆ సీన్ల షూటింగ్ కూడా ఫినిష్ చేస్తారు. మరోపక్క బన్నీ సినిమాకు కూడా బోయపాటి కూడా అరవింద్ కు పూర్తిగా నచ్చే స్క్రిప్ట్ ఇవ్వడానికి కిందా మీదా కసరత్తులు చేస్తున్నాడు.
పవన్ బాబు కూడా తక్కువ తినలేదు. సంపత నంది చెక్కినన్నాళ్లు చెక్కాడు. ఆ తరువాత గబ్బర్ సింగ్ 2 ను బాబి చెక్కుతున్నాడు. మూడు రోజుల షూటింగ్ తరువాత మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియనంతగా వాయిదా పడింది. ఎటొచ్చీ మెగా కాంపౌండ్ లో లేటెస్ట్ జనరేషన్ అంటే, సాయి ధరమ్, వరుణ్ లకు మాత్రం ఇలా స్క్రిప్టు లు చెక్కించేవారు లేరేమో?