జీవితా రాజశేఖర్ కుమార్తె శివానీ ఆరంగ్రేటం చేసిన “2 స్టేట్స్” రీమేక్ ఆగిపోయిన విషయాన్ని గ్రేట్ ఆంధ్ర ఇప్పటికే బయటపెట్టింది. ఇప్పుడు అలాంటిదే మరో న్యూస్. ఈసారి నాగశౌర్య వంతు. అవును.. నాగశౌర్య కూడా ఓ సినిమాను ఇలానే సగంలో ఆపేశాడు. ఆ మూవీ ఇక రిలీజ్ కాదు.
భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై రాజా కొలుసు దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ చేశాడు నాగశౌర్య. దాదాపు 2 షెడ్యూల్స్ పూర్తిచేసుకుంది ఈ మూవీ. అదే టైమ్ లో సినిమాకు కాస్త విరామం ఇచ్చి, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొన్నారు నిర్మాత ఆనంద ప్రసాద్. అంతే.. ఆ ఎన్నికల్లో ఆనంద ప్రసాద్ ఓడిపోవడం, ఈ సినిమా ఆగిపోవడం ఒకేసారి జరిగాయి.
2 స్టేట్స్ రీమేక్ విషయంలో జరిగినదే ఇక్కడ కూడా రిపీట్ అయిందంటున్నారు. అప్పటివరకు జరిగిన షూటింగ్ పై హీరో-నిర్మాత అస్సలు సంతృప్తి వ్యక్తంచేయలేదట. దీంతో ఈ సినిమాను అర్థాంతరంగా ఆపేశారు. సినిమాను పూర్తిగా పక్కనపడేస్తారా లేక మరో దర్శకుడ్ని లైన్లోకి తీసుకొస్తారా అనేది తేలాల్సి ఉంది. తాజా సమాచారం ప్రకారం, టోటల్ సినిమానే పక్కన పెట్టినట్టు తెలుస్తోంది.
ఈ మూవీపై హీరోయిన్ ఇషారెబ్బా చాలా హోప్స్ పెట్టుకుంది. ఇందులో తన పాత్ర చాలా బాగుంటుందని, కచ్చితంగా తనకు మంచి పేరొస్తుందని ఆ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. కానీ ఇప్పుడా సినిమా ఆగిపోయింది.