అల్లుశిరీష్ హీరోగా నటించిన ఏబిసిడి సినిమా గురించి ఇండస్ట్రీలో గ్యాసిప్ లు గుప్పుమంటున్నాయి. శిరీష్ కు చాలా అత్యుత్సాహం ఎక్కువయిందని, కొన్నిసార్లు డైరక్టర్ పాత్ర కూడా తానే పోషించాడని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, తను ఇప్పుడు అదే సినిమాను తన స్టయిల్ లో, తన అభిరుచికి తగ్గట్లు ఎడిట్ చేయిస్తున్నట్లు బోగట్టా. తను రకరకాల వెర్షన్లు కట్ చేయించి చూస్తూ, వాటిల్లో ఒకటి ఫైనల్ చేసేలా నిర్మాత మధుర శ్రీధర్ ను వత్తిడి చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ విషయంలో నిర్మాతకు హీరోకు మధ్య ఇటీవల చాలాకాలం టగ్ ఆఫ్ వార్ నడించిందని బోగట్టా. ఇవన్నీ తెలిసి కూడా నిర్మాత అల్లు అరవింద్ సైలంట్ గా వున్నారని, అటు కొడుకును కానీ, ఇటు నిర్మాతను కానీ సపోర్ట్ చేయకుండా సైలంట్ గా వున్నారని తెలుస్తోంది. ఇప్పటికే రెండు మూడు డేట్ లు వినిపించి ఆఖరికి మేలోకి వెళ్లింది ఎబిసిడి సినిమా. మలయాళ సినిమా ఆధారంగా తయారైన ఈ సినిమాకు దగ్గుబాటి సురేష్ బాబు సమర్పకుడు కావడం విశేషం.
అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు లాంటి వాళ్ల బ్యాకింగ్ వున్న సినిమాకు ఈ సమస్య రావడం విశేషం. సాధారణంగా హీరోలు సినిమాల వ్యవహారంలో కాళ్లు, వేళ్లు పెట్టడంపై చిన్న చిన్న గ్యాసిప్ లు వినిపించడం కామన్. కానీ అల్లుశిరీష్ విషయంలో ఇవీ చాలా ఎక్కువగా వినిపిస్తుండడం విశేషం.
ఇప్పటివరకు అల్లుశిరీష్ కెరీర్ ఇంకా కుదటపడలేదు. అలాంటి టైమ్ లో ఇలాంటి గ్యాసిప్ లు ఎక్కువగా వినిపించడం అంత మంచిది కాదేమో? శిరీష్ ఆలోచించుకోవాలి.