డైరక్టర్లు కథలు చెప్పడం, హీరోలు అయితే ఒకే, కాకుంటే నాట్ ఒకే అనడం మామూలే. కొత్త కాదు. అయితే డైరక్టర్ సుకుమార్ కు ఓ డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఎదురయిందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. విషయం ఏమిటంటే, మహేష్ సినిమా ఇస్తాడో ఇవ్వడో క్లారిటీలేదు. బన్నీ మాట ఇచ్చాడు. మరో హీరో అందుబాటులో లేడు. అందుకే బన్నీకి ఓ కథ నెరేట్ చేసారు సుకుమార్ అని తెలుస్తోంది.
మరి బన్నీనే చెప్పాడో? సుకుమార్ చెప్పినపుడు విన్నాడో, మొత్తానికి కథ గురించి మొత్తం తెలుసుకున్న బన్నీ స్నేహితుడు ఒకరు ఓ హాలీవుడ్ డివిడి ఒకటి తెచ్చి అందించాడట. అంతేకాదు ఆ హాలీవుడ్ సినిమా అక్కడ ఎలా ఫెయిల్ అయిందీ? ఎందుకు ఫెయిల్ అయిందీ అన్నది వివరించాడని బోగట్టా.
దాంతో బన్నీ అదే విషయం సుకుమార్ కు స్మూత్ గా వివరించి, మరో కథ రెడీచేయమని సింపుల్ గా చెప్పేసాడని తెలుస్తోంది. క్రియేటివ్ డైరక్టర్లు అందరికీ ఇదే సమస్య. కథలు స్వంతంగా వండలేరు. పాత సినిమాలు తిరగేసి, మరగేసి, లేదా అటు తిప్పి, ఇటు తిప్పి చెప్పడం తప్ప స్వంత స్క్రిప్ట్ రాదు. మేకింగ్ లో మాత్రం కింగ్ లు అనిపించుకుంటారు.
అయితే గీతా క్యాంప్ లో ఎక్కడయినా డైరక్టర్ కానీ, కథ దగ్గర మాత్రం కాదు. వాళ్లు ఓకే అనేదాకా వంటకాలు వండుతూ వుండాల్సిందే.