ఇటీవల తమిళంలో మాంచి పేరు తెచ్చుకున్న సినిమాల్లో 96 ఒకటి. ఈ సినిమాను తొలిచూపులోనే విపరీతంగా ఇష్టపడి, హక్కులు కొని, తన కెరీర్ లోనే తొలి రీమేక్ కు రెడీ అయ్యారు నిర్మాత దిల్ రాజు. శర్వానంద్-సమంత లాంటి క్రేజీ కాంబినేషన్ సెట్ చేసారు. ఉగాది నాడు కొబ్బరికాయ కొట్టేసారు.
అయితే సినిమాకు టైటిల్ ఏమిటి? అన్నది క్వశ్చను. 96 అన్న టైటిల్ పెట్టడం ఇష్టంలేదు. కుదరదు. ఎందుకంటే సినిమా ను మరీ అంత వెనక్కి తీసుకెళ్లడం లేదు. 2000 లేదా ఆ తరువాత జరిగినట్లు చూపిస్తారు. జాను అనే టైటిల్ అనుకున్నారు. సినిమాలో హీరోయిన్ పేరు జానకి కాబట్టి, జాను అనే టైటిల్ బాగుంటుందని అనుకున్నారు.
కానీ ఇప్పుడు ఆ టైటిల్ కూడా మిస్సయింది. మరోటి వెదకాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి కారణం బాహుబలి ప్రభాస్- డైరక్టర్ రాధాకృష్ణ కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా 'జాన్' అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. దాంతో ఇప్పుడు దిల్ రాజు 96 రీమేక్ కు వేరే పేరు వెదుకుతున్నారు.