పవన్ ను కలవనున్న చరణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు లేఖ రూపంలో మద్దతు తెలిపాడు స్టయిలిష్ స్టార్ బన్నీ. ఇప్పుడు మరో మెగా హీరో పర్సనల్ గా కలిసి మద్దతు తెలియచేయబోతున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు లేఖ రూపంలో మద్దతు తెలిపాడు స్టయిలిష్ స్టార్ బన్నీ. ఇప్పుడు మరో మెగా హీరో పర్సనల్ గా కలిసి మద్దతు తెలియచేయబోతున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సాయంత్రం విజయవాడలో బాబాయ్ పవన్ ను కలవబోతున్నాడు. నిన్నటికి నిన్న డీ హైడ్రేషన్ తో పవన్ ఆసుపత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే.

ఈ  సంగతి తెలిసిన రామ్ చరణ్ ఇప్పుడు విజయవాడ చేరుకున్నారు. బాబాయ్ ఆరోగ్యం ఎలా వుందో వాకబు చేయడంతో పాటు, ఆయనకు తన మద్దతు ప్రకటించనున్నారు. వాస్తవానికి రామ్ చరణ్ కు కాలు అంతగా బాగాలేదు. ఫైటింగ్ సీన్లు వంటివి చేయడానికి లేదు అందువల్ల షూటింగ్ క్యాన్సిల్ చేసారు. అయితే నవడానికి అభ్యంతరం లేదు.

అందుకే విజయవాడకు రామ్ చరణ్ రాగలిగారు. నాగబాబు నేరుగా జనసేన టికెట్ మీద పోటీ చేస్తున్నారు. నీహారిక ప్రచారం సాగించారు. బన్నీ మద్దతు ప్రకటించాడు. ఇప్పుడు రామ్ చరణ్ వంతు. మరి మిగిలిన మెగా హీరోల సంగతి ఏమిటో?