బెల్లంకొండ శ్రీనివాస్‌కంటూ ఫాన్ బేస్ లేదు. అలా అని అతనికి వరుస హిట్లూ లేవు. ఇంకా చెప్పాలంటే అతని సినిమాలతో అటు నిర్మాత, ఇటు బయ్యర్లు లాభపడిన దాఖలాలు లేవు. అయినా కానీ అతనిప్పుడు టాలీవుడ్ హాట్ హీరో. ప్రస్తుతం అతని చేతిలో అరడజను సినిమాలున్నాయి. మిడ్ రేంజ్ హీరోలు ఏ కథని రిజెక్ట్ చేసినా అది అటు, ఇటు తిరిగి బెల్లంకొండ దగ్గరకు వెళుతోంది.
హిట్స్ లేకపోయినా, ఫాన్స్ లేకపోయినా బెల్లంకొండ శ్రీనివాస్ ఎందుకంత హాట్? స్టార్ డైరెక్టర్లతో వరుసగా పనిచేసిన శ్రీనివాస్‌కి అదే ఇప్పుడు కొండంత అండగా మారింది. అతని చిత్రాలు ఫైనల్‌గా ఎలా ఆడినా కానీ గ్యారెంటీ ఓపెనింగ్స్ వస్తుంటాయి. అంతేకాకుండా నాన్ థియేట్రికల్ బిజినెస్ బాగా జరుగుతుంది. ఇక థియేట్రికల్ బిజినెస్ కూడా పన్నెండు నుంచి పదిహేను కోట్ల రేంజిలో జరుగుతుంది.
గ్యారెంటీ రిటర్న్స్ వుండడంతో నిర్మాతలు అతనిపై పెట్టుబడి పెట్టడానికి ముందుకొస్తున్నారు. సక్సెస్ లేనపుడే ఇలా వుంటే ఇక హిట్టయితే బెల్లంకొండ శ్రీనివాస్ పని ఇంకా సులువైపోతుంది. తేజ దర్శకత్వంలో రూపొందిన సీత తనని హిట్ హీరోగా నిలబెడుతుందని శ్రీనివాస్ ఆశిస్తున్నాడు.