వివి వినాయక్, బోయపాటి శ్రీనివాస్ తో మొదలుపెట్టి, తేజ, రమేష్ వర్మ వరకు వచ్చాడు హీరో బెల్లంకొండ శ్రీనివాస్. రాక్షసన్ రీమేక్ మొదలుపెట్టారు. ఆ సినిమా ఫస్ట్ లుక్, ప్రీలుక్ వదిలారు. ప్రీలుక్ చూస్తే ఏదో చేతబడులు, చిల్లంగులు అన్నట్లు ఓ లుక్ వదిలారు.
వాస్తవానికి రాక్షసన్ సినిమా రీమేక్ కదా? ఈ హర్రర్ మూవీ వ్యవహారం ఏమిటీ అనుకునేలోగా ఫస్ట్ లుక్ వచ్చింది. ఇందులో ఫ్యామిలీ టచ్, ఆపై విలన్ టచ్ రెండూ ప్రెజెంట్ చేసారు. రాక్షసన్ సినిమా అయితే నెగిటివ్ షేడ్ తో వుంటుంది. మరి ఈ సినిమాను తెలుగుకోసం దర్శకుడు రమేష్ వర్మ ఏం చేయబోతున్నారో?
ఇదిలావుంటే రాక్షసుడు టైటిల్ పెట్టడం అటు హీరోకు కానీ, హీరో వ్యవహారాలు చూసే బెల్లంకొండ సురేష్ కు కానీ ఇష్టంలేనట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండుసార్లు అదే టైటిల్ రావడం, అదీకాక టైటిల్ హీరోమీద వుండాలని వారు అనుకోవడం అందుకు కారణంగా తెలుస్తోంది.
అందుకే టైటిల్ ను ముందుగా లీక్ చేసి, ఫిక్స్ చేయడంలో డైరక్టర్ రమేష్ వర్మ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మీద విజయం సాధించినట్లు తెలుస్తోంది.