శ్రీ వికారినామ సంవత్సర రాశిఫలాలు

ప్రధాన గ్రహ సంచారం. (06-04-2019- 24-03-2020) ఈ ఏడాది గురుడు ఏప్రిల్‌22వరకు ధనుస్సులోనూ తదుపరి నవంబర్‌4వరకు వృశ్చికరాశి, తదుపరి సంవత్సరాంతం వరకూ ధనుస్సులోనూ సంచారం. శని వచ్చే జనవరి 24వరకు ధనుస్సు రాశిలోనూ, తదుపరి మకర…

ప్రధాన గ్రహ సంచారం. (06-04-2019- 24-03-2020)
ఈ ఏడాది గురుడు ఏప్రిల్‌22వరకు ధనుస్సులోనూ తదుపరి నవంబర్‌4వరకు వృశ్చికరాశి, తదుపరి సంవత్సరాంతం వరకూ ధనుస్సులోనూ సంచారం. శని వచ్చే జనవరి 24వరకు ధనుస్సు రాశిలోనూ, తదుపరి మకర రాశిలో సంచారం. ఇక రాహుకేతువులు సంవత్సరమంతా మిథునం, ధనుస్సు రాశుల్లో సంచరిస్తారు.

మేషం
వీరికి గురువు సంవత్సరాది నుండి ఏప్రిల్‌22 వరకు భాగ్య స్థానం (9వ ఇంట) ధనుస్సులోనూ, ఏప్రిల్‌ 22న తిరిగి అష్టమ స్థానం (8వ ఇంట) లోకి ప్రవేశించి నవంబర్‌4వరకు సంచారం. తదుపరి సంవత్సరాంతం వరకూ భాగ్య స్థానంలో  సంచారం. 
ఇక శని సంవత్సరాది నుంచి జనవరి 23వరకు ధనుస్సులోనూ, తదుపరి మకర రాశిలో సంచారం. రాహువు తృతీయమైన మిథునం,  కేతువు భాగ్య స్థానమైన ధనుస్సు రాశిలో   సంచారం.  
వీరికి కొంతవరకూ గురు బలం, సంవత్సరాంతంలో శని బలం ఉంటుంది. రాహు కేతువుల బలం లేదు.  ఏప్రిల్‌–నవంబర్‌మధ్య కాలం మినహా గురుబలం, శనిబలం అధికం. ఇక రాహుకేతువుల స్థితి అంత అనుకూలం కాదు. మొత్తం మీద గత ఏడాదికంటే మెరుగైన ఫలితాలు సాధిస్తారు.
కొన్ని సమస్యలు తీరి ఒడ్డున పడతారు. 
ఆర్థికంగా ఒడిదుడుకులు అధిగమించి ఉత్సాహంగా గడుపుతారు. 
బంధువర్గంతో విభేదాలు తొలగుతాయి.
కోర్టు కేసులు సుదీర్ఘ కాలం తరువాత పరిష్కారమయ్యే సూచనలు.
కుటుంబంలో  శుభకార్యాల నిర్వహణ.
క్లిష్టమైన పనులు సైతం మరింత  ఓపిగ్గా పూర్తి చేస్తారు. 
వ్యాపారులకు అత్యంత లాభదాయకమైన కాలం. భాగస్వాములు మీ అభిప్రాయాలను మన్నిస్తారు.  కొత్త వ్యాపారాలు సైతం ప్రారంభిస్తారు. సంబంధిత అనుమతులు లభిస్తాయి. 
ఉద్యోగస్తులు గత ఏడాదికంటే మరింత గుర్తింపు పొందుతారు. ఊహించని విధంగా ప్రమోషన్లు దక్కవచ్చు.
విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఖాయం.
నిరుద్యోగులు ఉద్యోగాన్వేషణలో విజయం సాధిస్తారు. ఊహించని విధంగా అవకాశాలు లభిస్తాయి. టెక్నికల్ వారికి గతం కంటె మెరుగ్గా ఉంటుంది.
వ్యవసాయదారులకు రెండు పంటలు లాభిస్తాయి.
ఏప్రిల్‌–నవంబర్‌మధ్య కాలంలో  కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడులు, విమర్శలు ఎదుర్కొంటారు. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రులు సందర్శిస్తారు.
కళాకారులకు కొత్త అవకాశాలు దక్కడంతో పాటు విదేశీ పర్యటనలు కూడా ఉంటాయి.
రాజకీయనేతలకు ఊహించని పదవీయోగాలు. 
ఆదాయం–14, వ్యయం-14, రాజ్యపూజ్యం–3, అవమానం–7. 
వీరు గురువు, రాహుకేతువులకు పరిహారాలు చేయించుకోవాలి.
సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకాలు 
గౌరీదేవికి కుంకుమార్చనలు శుభప్రదం. 
ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, మాఘం, ఫాల్గుణ మాసాలు విశేషంగా కలిసివస్తాయి.

వృషభం
ఈ రాశి వారికి గురువు ఏప్రిల్‌22వరకు అష్టమ స్థానం (8వ ఇంట) ధనుస్సు రాశిలోనూ, తదుపరి 7వ ఇంట వృశ్చిక రాశిలో ప్రవేశించి నవంబర్‌4వరకు సంచారం. అనంతరం 8వ ఇంట ధనుస్సు రాశిలో సంచారం.
శని సంవత్సరాది నుండి జనవరి 24వరకు  అష్టమ స్థానం ధనుస్సురాశిలో సంచారం, తదుపరి భాగ్య స్థానం మకర రాశిలో  సంచారం. ఇక రాహువు ద్వితీయం, కేతువు అష్టమంలోనూ సంచారం.
వీరికి ఈ ఏడాది మధ్య కాలంలో కొంతవరకూ అనుకూల వాతావరణం ఉంటుంది. 
అష్టమ శని, గురుని ప్రభావంతో ఈతి బాధలు ఎదుర్కొంటారు.
తరచూ మానసిక ఆందోళన.
ఆర్థికంగా కొంత నిలదొక్కుకునే సమయానికి ఏదో అవసరం వచ్చి మళ్లీ అప్పులు చేస్తారు.
రుణ దాతలు ఒత్తిడులు మరింత పెంచుతారు.
బంధు మిత్రుల నుంచి ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు. 
ప్రత్యర్థుల విషయంలో తీసుకునే నిర్ణయాల పై  ఆచితూచి వ్యవహరించడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు వద్దు. 
గృహం, ఆభరణాలు, భూములు కొనుగోలు చేసే యత్నాలు ద్వితీయార్ధంలో నెరవేరే సూచనలున్నాయి. 
నిరుద్యోగులకు ద్వితీయార్ధంలో  కొత్త ఆశలు చిగురిస్తాయి. ఇంటర్వ్యూలకు హాజరవుతారు.
విద్యార్థులు లక్ష్య సాధనలో మరింతగా శ్రమించాల్సి ఉంటుంది, అయితే ఏప్రిల్‌నుంచి గురు బలం కారణంగా అనుకున్న విద్యావకాశాలు దక్కుతాయి.
రాజకీయ నాయకులకు అరుదైన కొన్ని అవకాశాలు మధ్యలో దక్కుతాయి. 
వ్యాపారులకు లాభాలు అందీఅందనట్లుగా కనిపిస్తాయి. కొత్త పెట్టుబడులు, భాగస్వాముల సమీకరణలో శ్రమపడాలి.
ఉద్యోగులకు ఆకస్మిక  బదిలీలు ఉండవచ్చు, కొన్ని బాధ్యతలు మీద వేసుకుని తరువాత చింతిస్తారు.
పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారు ఊహించిన దానికంటె మెరుగైన ఫలితాలు పొందుతారు. అయితే శ్రమ తప్పక పోవచ్చు. 
కళాకారులకు కొన్ని అవకాశాలు నిరాశ కలిగించినా క్రమేపీ పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యవసాయదారులకు మొదటి పంట కంటె రెండవ పంట లాభసాటిగా ఉంటుంది. 
కుటుంబ, వృత్తిపరమైన చికాకులు తప్పకపోవచ్చు. వాహనాలు, ఆరోగ్య విషయాల్లో మరింత అప్రమత్తత అవసరం. 
ఆదాయం– 8 వ్యయం–8, రాజ్యపూజ్యం–6, అవమానం–6
వీరు గురు, శని గ్రహాలకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. 
దుర్గామాతకు ప్రత్యేకంగా కుంకుమార్చనలు చేయించాలి. 
చైత్రం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, మాఘ మాసాలు అనుకూలం.

మిథునం
వీరికి గురువు ఏప్రిల్‌22వరకు సప్తమ స్థానం ధనుస్సులోనూ, తదుపరి షష్టమ స్థానం వృశ్చిక రాశిలో సంచారం.  తిరిగి నవంబర్‌4 నుండి సప్తమ స్థితి ధనుస్సు రాశిలో సంచారం.
శని జనవరి 24వరకు సప్తమ స్థానం ధనుస్సు రాశిలోనూ తదుపరి సంవత్సరాంతం వరకూ మకరరాశిలో సంచారం. ఇక రాహువు జన్మరాశిలోనూ, కేతువు సప్తమ స్థానంలోనూ సంచారం.
వీరికి ప్రథమార్థంలో గురు బలం విశేషం. తదుపరి సామాన్యం. అలాగే, శని, కేతువులు, జన్మరాహువు దోషకారులు. 
ఈరీత్యా చూస్తే ప్రథమార్థంలో కొంత ఊరట కలిగించే విధంగా ఉంటుంది.
ఆర్థికపరమైన ఇబ్బందులు కొంత తీరతాయి. పొదుపు పాటిస్తారు.
పనుల్లో ప్రతిబంధకాలు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు.
కొంత ఆందోళన కలిగించే సమాచారాలు అందుతాయి.
జీవిత భాగస్వామి, బంధువర్గంతో తరచూ విరోధాలు, కొత్త సమస్యలు ఎదురుకావచ్చు. 
ఆస్తుల వ్యవహారాలలో కోర్టులకు కూడా వెళ్లే అవకాశం.
ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ముందుకు సాగడం మంచిది.
ఇంటి నిర్మాణాల పై దష్టి సారించినా కదలికలు ఉండవు.
తండ్రి తరఫు వారితో విరోధాలు.
వ్యాపారాలలో మరింత శ్రమించాలి. కొత్త భాగస్వాములతో విభేదాలు నెలకొంటాయి. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. 
ఉద్యోగులు ప్రధమార్థంలో కోరుకున్న మార్పులు పొందుతారు. అయితే బాధ్యతలతో సతమతమవుతారు. విధి నిర్వహణలో మరింత శ్రద్ధ వహించాలి.
పారిశ్రామికవేత్తలు తరచూ విదేశీ పర్యటనలు సాగిస్తారు. కొత్త సంస్థలు, కంపెనీల ఏర్పాటులో కషి ఫలిస్తుంది.
రాజకీయవేత్తలకు కొత్త ప్రథమార్థంలో పదవులు లభిస్తాయి. విశేష ప్రజాదరణ లభిస్తుంది.
కళాకారులకు సామాన్య ఫలితాలు. అనుకున్న అవకాశాలు కొన్ని చేజారవచ్చు.
వ్యవసాయదారులకు మొదటి పంట అనుకూలిస్తుంది.
విద్యార్థులు విదేశీ విద్యావకాశాల కోసం చేసే యత్నాలు సఫలీకతమవుతాయి.
ద్వితీయార్థంలో ఆరోగ్యం పై మరింత శ్రద్ధ వహించడం మంచిది. తరచూ ఆస్పత్రుల సందర్శనం, శత్రువుల పై ఓ కన్నేసి ఉంచండి.
ఆదాయం–11, వ్యయం –5, రాజపూజ్యం–2, అవమానం–2.
వీరు గురు, శని, రాహువులకు పరిహారాలు చేయాలి. 
ఆంజనేయస్వామికి అర్చనలు చేయండి.
చైత్రం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిర మాసాలు అనుకూలం.

కర్కాటకం
ఈ రాశి వారికి గురుడు ఏప్రిల్‌22వరకు షష్ఠమ స్థానం ధనుస్సులోనూ, తదుపరి వృశ్చికంలో ప్రవేశించి నవంబర్‌4వరకు పంచమ స్థానంలోనూ, తదుపరి సంవత్సరాంతం వరకూ షష్ఠమమైన ధనుస్సు రాశిలో సంచారం
ఇక శని జనవరి 24వరకు షష్ఠమ స్థానమైన ధనుస్సులో, తదుపరి సంవత్సరాంతం వరకూ సప్తమమైన మకర రాశిలో సంచారం. రాహువు వ్యయంలోనూ, కేతువు షష్ఠమంలోనూ సంచారం.
వీరికి ద్వితీయార్థంలో గురుబలం అధికం. అలాగే, జనవరి వరకూ శని బలం ఉంటుంది. రాహుగ్రహ సంచారం వల్ల మానసిక ఆందోళన, తరచూ ఆరోగ్య సమస్యలు, శత్రు బాధలు వంటి ఫలితాలు ఉండవచ్చు.
ఎంతటి కార్యాన్నైనా పూర్తి చేసి మీ సత్తా నిరూపించుకుంటారు.
ఆర్థికంగా  చికాకులు ఎదురైనా తదుపరి పరిస్థితులు అనుకూలించి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి చేరుకుంటారు. అయితే తరచూ వృథా ఖర్చులు పెరుగుతాయి. 
అనుకున్నది సాధించాలన్న తపన, పట్టుదలే మీ విజయాలకు బాటవేస్తాయి.
గతంలో కొన్ని సమస్యలు చికాకు పరచినా అనుభవాలతో ప్రస్తుతం వాటిని దృష్టిలో ఉంచుకుని సరైన నిర్ణయాలు  తీసుకుంటారు.
సంఘంలో గౌరవప్రతిష్ఠలకు లోటు ఉండదు. 
ఆధ్యాత్మిక భావాలు పెరిగి మఠాలు, పీఠాల దర్శనాలు చేసుకుంటారు.
ఇంటి నిర్మాణాలు, కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
చిత్రవిచిత్ర సంఘటనలు, సమాచారాలు మిమ్మల్ని ఆకట్టుకుంటాయి.
వ్యాపారస్తులు అనుకున్న పెట్టుబడులు సమకూర్చుకుని లాభాల బాటపడతారు. కొత్త భాగస్వాముల సమీకరణలో విజయం సాధిస్తారు.
ఉద్యోగస్తులు అప్పగించిన బాధ్యతలు పూర్తి చేసి సమర్థతనను చాటుకుంటారు. ప్రమోషన్లు లభించి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. 
పారిశ్రామికవేత్తలు అనుకున్న ప్రగతిని సాధించి విశేష గుర్తింపు పొందుతారు.
రాజకీయవేత్తలకు మరింత ప్రజాదరణ లభిస్తుంది. కోరుకున్న పదవులు, హోదాలు దక్కే అవకాశం.
కళాకారులు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు. ఊహించని అవార్డులు, పురస్కారాలు అందుతాయి.
సాహిత్యకారులు, జర్నలిస్టులు, క్రీడాకారులకు పట్టింది బంగారమే. 
వ్యవసాయదారులకు మొదటి పంట విశేషంగా లాభిస్తుంది.
ఏడాది చివరిలో వ్యయప్రయాసలు. మానసిక అందోళన, శారీరక రుగ్మతలు వంటి బాధలు తప్పక పోవచ్చు. 
ఆదాయం–5 వ్యయం–5, రాజపూజ్యం–5, అవమానం–2
వీరు గురు, రాహువులకు పరిహారాలు చేయించుకోవాలి. 
అలాగే, దుర్గామాతకు అధికంగా కుంకుమార్చనలు చేయండి.
చైత్రం, జ్యేష్ఠం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, ఫాల్గుణ మాసాలు అనుకూలం.

సింహం
ఈ రాశి వారికి గురువు ఏప్రిల్‌22వరకు పంచమ స్థానం ధనుస్సులోనూ, తదుపరి  వృశ్చిక రాశిలో ప్రవేశించి నవంబర్‌4వరకు చతుర్ధంలో  సంచారం. తదుపరి పంచమస్థానమైన ధనుస్సురాశిలో సంవత్సరాంతం వరకూ సంచారం.
శని  జనవరి 24వరకు పంచమ స్థానమైన ధనుస్సు రాశిలోనూ, తదుపరి సంవత్సరాంతం వరకూ షష్ఠమ స్థానం మకరరాశిలో సంచారం. రాహువు లాభం, కేతువు పంచమ స్థానాలలో సంచారం.
వీరికి గురు బలం విశేషం. అలాగే, సంవత్సరాంతంలో శని బలం అధికం.
ఆర్థికంగా మరింత బలం చేకూరి రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. 
అనుకున్న కార్యక్రమాలు ఎప్పటికప్పుడు పూర్తి చేసి విజయం వైపు సాగుతారు.
బంధువర్గంతో విభేదాలు, మనస్పర్థలు తొలగుతాయి.
మీ పై వచ్చిన అపవాదులు, విమర్శలు తొలగుతాయి.
భక్తిభావాలు పెరుగుతాయి. తరచూ తీర్థయాత్రలు చేస్తారు.
నూతన గృహ, భూయోగాలు కలుగుతాయి.
సంతానం వివాహ, ఉద్యోగయత్నాలు సఫలీకృతమై  ఉత్సాహంతో సాగుతారు.
ద్వితీయార్థంలో శారీరక రుగ్మతలతో బాధపడతారు. 
కుటుంబంలో ఒత్తిడులు ఎదురైనా చాకచక్యంగా అధిగమిస్తారు.
శుభకార్యాలు, ఇతర వేడుకలతో కుటుంబంలో సందడి వాతావరణం నెలకొంటుంది.
కాంట్రాక్టర్లకు అనూహ్యమైన విధంగా టెండర్లు దక్కుతాయి.
వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులతో సంస్థలను విస్తరిస్తారు. భాగస్వాముల అన్వేషణలో సఫలమవుతారు.
ఉద్యోగాలలో మరిన్ని మార్పులకు అవకాశం. ఉన్నతవర్గాల చేయూత అందుతుంది. 
పారిశ్రామికవేత్తలు అనుకున్న ప్రగతితో ముందడుగు వేస్తారు. ప్రభుత్వంతో వివాదాలు, కోర్టు కేసులు పరిష్కారమవుతాయి.
రాజకీయవేత్తలను పదవులు వరిస్తాయి. విశేష ప్రజాదరణతో ముందుకు సాగుతారు.
కళాకారులు అందిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు.
క్రీడాకారులు ప్రతిభను చాటుకుంటారు. అవార్డులు సైతం దక్కించుకుంటారు.
వ్యవసాయదారులకు రెండు పంటలూ అనుకూలం. 
ఆదాయం–8, వ్యయం–14, రాజపూజ్యం–1, అవమానం –5. 
వీరు శివాభిషేకాలు జరిపిస్తే మంచిది.
చైత్రం, వైశాఖం, ఆషాఢం, కార్తీకం, మార్గశిరం, ఫాల్గుణ మాసాలు అనుకూలమైనవి.

కన్య
వీరికి గురువు సంవత్సరాది నుండి ఏప్రిల్‌22వరకు చతుర్ధమైన ధనుస్సులోనూ, తదుపరి నవంబర్‌4వరకు తృతీయమైన వృశ్చికంలోనూ, తదుపరి సంవత్సరాంతం వరకు చతుర్ధమైన ధనుస్సురాశిలో సంచారం.
ఇక శని జనవరి 24వరకు అర్థాష్టమ స్థానమైన ధనుస్సులోనూ, తదుపరి పంచమ స్థానమైన మకరంలోనూ సంచారం. రాహువు దశమంలోనూ, కేతువు చతుర్ధంలోనూ సంచారం.
వీటిని పరిశీలించగా, మొత్తం మీద వీరికి సామాన్యంగానే ఉంటుంది. నవంబర్‌నుంచి గురు బలం, జనవరి నుంచి శని బలం చేకూరుతుంది. 
రాబడి ఉన్నా ఖర్చులు కూడా విశేషంగా పెరిగి సవాలుగా మారతాయి. 
పనుల్లో ప్రతిబంధకాలు, జాప్యం తప్పకపోవచ్చు.
తరచూ ప్రయాణాలు, తద్వారా శ్రమాధిక్యం.
శారీరక రుగ్మతలు, ముఖ్యంగా నరాలు, జ్వర సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి.
ప్రతి విషయంలోనూ ఆందోళన చెందుతారు. 
బంధువుల చేయూతతో  కొన్ని కార్యక్రమాలు మధ్యమధ్యలో  పూర్తి చేస్తారు. 
ఆర్థిక పరమైన హామీలకు దూరంగా ఉండండి.
వ్యాపారులకు కొంత వరకూ లాభాలు దక్కుతాయి. కొత్త భాగస్వాముల చేరికలో కొంత జాప్యం.
ఉద్యోగస్తులు అనుకోని మార్పులు జరిగి కొంత అసహనంతో గడుపుతారు. అలాగే, విధులు మరింతగా పెరుగుతాయి.
పారిశ్రామికవేత్తలకు ద్వితీయార్థంలో కొంత అనుకూలత ఉండవచ్చు.
వ్యవసాయదారులకు మొదటి పంట అనుకూలిస్తుంది. 
విద్యార్థులకు ఫలితాలు, అవకాశాలు సంతప్తి కలిగించవు. 
పరిశోధకులు, శాస్త్రవేత్తలు, కళాకారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
ఆదాయం–11, వ్యయం–5, రాజపూజ్యం–4, అవమానం–5.
వీరు శనీశ్వరునికి తైలాభిషేకం, 
రాహుకేతువుల దోష నివారణకు అమ్మవారికి కుంకుమార్చనలు చేయడం మంచిది. 
అలాగే గురుదోష నివారణకు పరిహారాలు చేయించుకుంటే మేలు.
ఆషాఢం, శ్రావణం, కార్తీకం, మార్గశిరం, ఫాల్గుణ మాసాలు అనుకూలం.

తుల
వీరికి గురువు సంవత్సరాది నుండి ఏప్రిల్‌22 వరకు తృతీయమైన ధనుస్సులోనూ, తదుపరి నవంబర్‌4వరకు ద్వితీయమైన వృశ్చికంలోను, తదుపరి సంవత్సరాంతం వరకు తతీయమైన ధనుస్సులో సంచారం.
శని జనవరి 24వరకు తృతీయమైన ధనుస్సులోనూ, తదుపరి అర్థాష్ఠమమైన మకర రాశిలో సంచారం. రాహువు సంవత్సరమంతా భాగ్యస్థానమైన మిథునం, కేతువు తృతీయమైన ధనుస్సులో సంచారం.
వీరికి ఏప్రిల్‌22 నుంచి నవంబర్‌వరకు గురు బలం , సంవత్సరమంతా శని, రాహుకేతువుల బలం విశేషం. జనవరి 24 నుంచి అర్థాష్టమ శని ప్రారంభమవుతుంది.
ఈ రీత్యా చూస్తే వీరికి  జనవరి వరకూ అన్నీ శుభదాయకంగానే ఉంటుంది. జ్ఞానాన్ని మరింత పెంచుకుంటారు.
ఆధ్యాత్మికంగా మరిన్ని కార్యక్రమాలు చేపడతారు.
మీ భవిష్యత్తుకు భరోసా ఏర్పడుతుంది.
దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడతారు.
అవివాహితులకు వివాహ యోగం కలిగే సూచనలు.
ఆర్థికపరంగా మరింత అభివృద్ధి కనిపిస్తుంది. రెండుమూడు విధాలుగా ధన లాభాలు కలుగుతాయి.
ఆస్తులు కొనుగోలు ప్రయత్నాలు కలసి వస్తాయి.
మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ ఉపయుక్తమైనవిగా ఉంటాయి.
ఇంటి నిర్మాణాలు ఏప్రిల్‌–నవంబర్‌మధ్య కాలంలో అనుకూలిస్తాయి. ఊహించని రీతిలో భూములు కొనుగోలు చేస్తారు.
తండ్రి తరఫువారితో విభేదాలు పరిష్కరించుకుంటారు.
కొన్నేళ్లుగా కోర్టుల్లో నలుగుతున్న కేసు ఒకటి పరిష్కారమవుతుంది.
వ్యాపారులకు పట్టింది బంగారమే. ఏ వ్యాపారం ప్రారంభించినా లాభాలు తథ్యం. 
ఉద్యోగులకు ప్రమోషన్లు ఊరటనిస్తాయి. ఉన్నతాధికారులు మీపట్ల మరింత సానుకూలత చూపడం విశేషం.
పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని ఒప్పించి అనుమతులు సాధిస్తారు. కొత్త కంపెనీల ప్రారంభంలో ఆటంకాలు తొలగుతాయి.
రాజకీయవేత్తలకు ఊహించని పదవులు రావచ్చు. అలాగే, ప్రజాదరణలో లోటు ఉండదు.
సినీ,టీవీ కళాకారులు అవార్డులు పొందుతారు. ప్రతిభను చాటుకుని కొత్త అవకాశాలు సాధిస్తారు.
క్రీడాకారులు, న్యాయవాదులు, వైద్యులకు మంచి గుర్తింపు లభిస్తుంది.
వ్యవసాయదారులకు రెండుపంటలూ అనుకూలిస్తాయి.
మహిళలు అన్ని రంగాలలోనూ విశేషంగా రాణిస్తారు.
జనవరి 24 నుంచి అర్థాష్టమ శని ప్రభావంతో పాటు, నవంబర్‌నుంచి గురుబలం తగ్గిన కారణంగా శారీరక రుగ్మతలు, ఇతరులతో మాటపడాల్సి పరిస్థితులు. మానసిక అధైర్యం. తరచూ ఇంటాబయటా విభేదాలు వంటి ఫలితాలు ఉంటాయి. 
ఆదాయం–8, వ్యయం–8, రాజపూజ్యం–7, అవమానం–1
వీరు అర్థాష్టమశని దోష నివారణకు శనీశ్వరుని తైలాభిషేకాలు జరిపించుకోవాలి. అలాగే, నవంబర్‌నుంచి గురుదోష నివారణకు పరిహారాలు చేయించుకోవాలి.
చైత్రం, శ్రావణం, భాద్రపదం, కార్తీకం, మార్గశిరం, ఫాల్గుణ మాసాలు అనుకూలం.

వృశ్చికం
వీరికి గురువు ఏప్రిల్‌22వరకు ద్వితీయమైన ధనుస్సురాశిలోనూ, తదుపరి నవంబర్‌4వరకు జన్మరాశిలో సంచరించి తిరిగి ద్వితీయమైన ధనుస్సులో ప్రవేశించి సంవత్సరాంతం వరకూ సంచరిస్తాడు.
శని జనవరి 24వరకు ద్వితీయమైన ధనుస్సులోనూ, తదుపరి తృతీయమైన మకర రాశిలో సంచారం. రాహువు ఏడాదంతా అష్టమమైన మిథునం, కేతువు ద్వితీయమైన ధనుస్సు రాశిలో సంచారం.
వీరికి గురు బలం కొంతవరకూ ఉంది. జనవరి వరకూ ఏల్నాటి శని ప్రభావంతో పాటు, సంవత్సరమంతా అష్టమ రాహువు, ద్వితీయంలో కేతు సంచారం ప్రతికూలం.
ఈరీత్యా చూస్తే మొత్తం మీద గురుబలం మీద కొంతవరకూ నెట్టుకొస్తారు.
తరచూ శారీరక సంబంధిత రుగ్మతలు బాధపెట్టవచ్చు. అష్టమ రాహువు ప్రభావం వల్ల వాహనాలు నడిపే వారు అత్యంత జాగరూకతతో మసలు కోవాలి. అలాగే, కొందరికి శస్త్ర చికిత్సలు జరుగవచ్చు.
ఏపనిపైనా శ్రద్ధ ఉండదు, మీ ఆలోచనలు నిలకడగా సాగవు. 
కుటుంబ సభ్యులతో వైరం. వారి విధానాలను వ్యతిరేకించడం ద్వారా కొంత ఎడబాటు ఉండవచ్చు.
మొత్తం మీద వీరికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.
వివాహ యత్నాలు కలసి వస్తాయి.
వ్యాపారులు లాభాలు కనిపిస్తాయి. నూతన పెట్టుబడుల అన్వేషణలో విజయం సాధిస్తారు.
ఉద్యోగులు పనితీరు మెరుగుపర్చుకుని ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు.
పారిశ్రామికవేత్తలకు తరచూ విదేశీ పర్యటనలు. ప్రభుత్వంలో చర్చలు ఉంటాయి.
రాజకీయవేత్తలకు పదవులు ఊరిస్తుంటాయి. 
కళాకారులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు.
విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు.
వ్యవసాయదారులకు రెండవపంట అనుకూలిస్తుంది.
క్రీడాకారులు, పరిశోధకులు, టెక్నాలజీ రంగాల వారు మరింత గుర్తింపు పొందుతారు.
ఆదాయం –14, వ్యయం–14, రాజ పూజ్యం–3, అవమానం–1.
శనికి తైలాభిషేకాలు, 
రాహుదోష నివారణకు అమ్మవారికి కుంకుమార్చనలు, 
ఈశ్వరారాధన మంచిది.
వైశాఖం, ఆషాఢం, భాద్రపదం, కార్తీకం, మార్గశిరం, పుష్యమాసాలు అనుకూలం.

ధనుస్సు
ఈ రాశి వారికి గురువు ఏప్రిల్‌22వరకు జన్మరాశిలోనూ, తదుపరి నవంబర్‌4వరకు వ్యయస్థానమైన వృశ్చి కరాశిలో సంచరించి తదుపరి   సంవత్సరాంతం వరకు జన్మరాశిలో సంచారం. 
శని జనవరి 24వరకు జన్మరాశిలోనూ తదుపరి ద్వితీయమైన మకరరాశిలో సంచారం. రాహువు సప్తమమైన మిథునం, కేతువు జన్మరాశిలో సంచారం.
గ్రహ స్థితి పరిశీలించగా, వీరికి ఏల్నాటిశనితో పాటు, గురుని వ్యయ, జన్మరాశిలో సంచారం, రాహువు సప్తమం, కేతువు జన్మరాశిలో సంచారం కారణంగా అన్ని విషయాలలోనూ జాగరూకతతో మెలగాలి.
అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు మీ సహనాన్ని పరీక్షిస్తాయి.
అనుకున్న సమయానికి డబ్బు అందక తరచూ ఇబ్బందులు పడతారు. ఆస్తుల క్రయవిక్రయాలు కూడా అంతగా లాభించవు. అనుకున్నంత ఆదాయం లేక రుణాలు చేయాల్సిన పరిస్థితి. లేనిపోని ఖర్చులు కూడా పెరుగుతాయి.
బంధువులు, మిత్రులతో అకారణంగా తగాదాలు నెలకొంటాయి. 
శారీరక రుగ్మతలు, మనోక్లేశాలు బాధిస్తాయి. ఆస్పత్రులు సందర్శిస్తారు. 
తల్లిదండ్రుల తరఫు వారి నుంచి సమస్యలు ఎదురుకావచ్చు. 
అవివాహితులకు శ్రమానంతరం వివాహాలు జరుగుతాయి. 
వ్యాపారులకు లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఆశించినంత ప్రగతి కనిపించదు.
ఉద్యోగులు తరచూ మార్పులు పొందుతారు. మీ పట్ల కొంత వ్యతిరేకత ఉంటుంది.
పారిశ్రామికవేత్తలు ప్రణాళికలు కార్యరూపం దాల్చక నిరాశ చెందుతారు. 
రాజకీయవేత్తలకు అతికష్టం మీద కొంత అనుకూలత ఉంటుంది. పదవులు చేజారవచ్చు.
విద్యార్థులు మరింత శ్రమపడాలి. సామాన్య ఫలితాలు సాధిస్తారు.
కళాకారులకు అవకాశాలు తగ్గుతాయి. 
న్యాయవాదులు, క్రీడాకారులు, వైద్యులకు సమస్యలు ఎదురుకావచ్చు.
వ్యవసాయదారులకు రెండవ పంట కొంత అనుకూలిస్తుంది.
ఆదాయం –2, వ్యయం–8, రాజపూజ్యం–6, అవమానం–1.
వీరు శని, రాహుకేతువులు, గురునికి విశేషంగా పరిహారాలు చేయించుకోవాలి. అను నిత్యం దైవారాధన మంచిది.
చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, భాద్రపదం, కార్తీకం, ఫాల్గుణ మాసాలు అనుకూలం.

మకరం
ఈ రాశి వారికి గురువు ఏప్రిల్‌22వరకు వ్యయ స్థానమైన ధనుస్సులోనూ, తదుపరి నవంబర్‌4వరకు లాభ స్థానం వృశ్చిక రాశిలో సంచరించి తిరిగి నవంబర్‌నుంచి సంవత్సరాంతం వరకూ వ్యయస్థానమైన ధనుస్సులో సంచారం.
ఇక శని జనవరి 23వరకు వ్యయ స్థానమైన ధనుస్సులోనూ, తదుపరి జన్మరాశిలోనూ సంచారం. రాహువు సంవత్సరాంతం వరకు షష్ఠమైన కర్కాటకంలోనూ, కేతువు వ్యయ స్థానమైన ధనుస్సులోనూ సంచారం.
వీరికి ఏల్నాటి శని ప్రభావం అధికం. అయితే ఏప్రిల్‌22 నుంచి నవంబర్‌4వరకు లాభ గురువు యోగకారకుడు. రాహువు అనుకూలుడు. కేతువు అంతగా కలసిరాదు. జనవరి నుంచి శని జన్మరాశి సంచారం కారణంగా ఆరోగ్య సమస్యలు. మానసిక అశాంతి. అయినవారితో విభేదాలు నెలకొనవచ్చు. ఏ పనిపైనా శ్రద్ధ చూపరు.
మొత్తం మీద గురు బలం కాలంలో విశేష సంపదలు పొందుతారు. ఆర్థికంగా ఎటువంటి లోటు లేకుండా గడుపుతారు. ఖర్చులు మీదపడినా అధిగమిస్తారు. 
వివాహాది శుభకార్యాల నిర్వహణ. 
సంతానపరంగా మరింత సౌఖ్యం. 
జ్ఞాతుల ద్వారా ఆస్తి లేదా ధన లాభాలు కలుగుతాయి.
ఇంటి నిర్మాణాలు, ఆస్తుల కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి.
సోదరులు, స్నేహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు.
తీర్థ యాత్రలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు.
మీ అభిప్రాయాలు, నిర్ణయాలు కుటుంబ సభ్యులకు శిరోధార్యంగా మారతాయి.
వ్యాపారస్తులు అనుకున్న విధంగా లాభాలు అందుకుంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. 
ఉద్యోగస్తులకు ప్రమోషన్లు దక్కే ఛాన్స్‌. విశేష గుర్తింపు పొందుతారు.
పారిశ్రామికవేత్తలకు అనూహ్యమైనరీతిలో ప్రభుత్వం నుంచి సహాయం అందుతుంది. కొత్త పరిశ్రమల ఏర్పాటులో విజయం సాధిస్తారు.
రాజకీయవేత్తలకు మరిన్ని పదవులు దక్కుతాయి. విశేష ప్రజాదరణ పొందుతారు.
కళాకారులు, క్రీడాకారులకు పట్టింది బంగారమే. పురస్కారాలు, అవార్డులు రావచ్చు.
వైద్యులు, న్యాయవాదులు, ఐటీ రంగం వారికి మరింత అనుకూలత ఉంటుంది.
వ్యవసాయదారులకు రెండవపంట బాగా కలసి వస్తుంది.
ఆదాయం–5, వ్యయం–2, రాజపూజ్యం–2, అవమానం–4.
వీరు శనీశ్వరునికి తైలాభిషేకాలు, 
ఆంజనేయస్వామికి అర్చనలు చేయించుకుంటే ఉపశమనం లభిస్తుంది.
చైత్రం, ఆషాఢం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యమాసాలు అనుకూలం.

కుంభం
వీరికి గురువు ఏప్రిల్‌22వరకు లాభ స్థానమైన ధనుస్సులోనూ, తదుపరి నవంబర్‌4 వరకు దశమస్థానమైన వృశ్చికంలో సంచరించి తదుపరి లాభస్థానమైన ధనుస్సులో ప్రవేశించి సంవత్సరాంతం వరకూ సంచరిస్తాడు.
ఇక శని జనవరి 23వరకు లాభస్థానంలో సంచరించి తదుపరి వ్యయస్థానమైన మకరరాశిలో ప్రవేశిస్తాడు. ఇప్పటి నుంచి ఏల్నాటి శని ప్రారంభమవుతుంది. రాహువు ఏడాదంతా పంచమమైన మిథునం, కేతువు లాభస్థానమైన ధనుస్సులో సంచారం.
వీరికి గ్రహస్థితి అంతా అనుకూలమైనదే. గురు, శని, కేతువు,రాహువులు సంవత్సరమంతా శుభులే. జనవరి 24నుంచి వీరికి ఏల్నాటి శని ప్రారంభమవుతుంది.
మొత్తం మీద వీరు విజయాలు, అభివృద్ధి వైపు పరుగులు తీస్తారు.
ఏ కార్యం తలపెట్టినా విజయవంతంగా పూర్తి కాగలవు.
ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. అవసరానికి మించి డబ్బు అందుతుంది. జ్ఞాతుల ద్వారా ధన లాభాలు. 
ఆస్తుల కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఇంటి నిర్మాణాలు సకాలంలో పూర్తి చేస్తారు.
వివాహాది శుభకార్యాల రీత్యా ఖర్చులు అధికంగా చేస్తారు.
రాహువు పంచమ స్థితి కారణంగా సంతానం వల్ల కొద్దిపాటి సమస్యలు, ఒత్తిడులు ఉండవచ్చు.
నిరుద్యోగులు ఉద్యోగావకాశాలు పొందుతారు.
గత ఏడాది కంటే మరింత మెరుగుదల ఉంటుంది.
కోర్టు కేసులు పరిష్కారమై ఊరట చెందుతారు.
వ్యాపారులు అనుకున్న దాని కంటే ఎక్కువగా లాభాలు పొందుతారు. నూతన భాగస్వాములు చేరతారు.
ఉద్యోగులు కోరుకున్న మార్పులు పొందుతారు. అవార్డులు లేదా పురస్కారాలు అందుకుంటారు.
పారిశ్రామికవేత్తలకు ఊహించని అవకాశాలు దక్కవచ్చు. కొత్త పరిశ్రమల ఏర్పాటులో విజయం.
టీవీ, సినీకళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. విశేష గుర్తింపు పొందుతారు.
విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనపరుస్తారు. అనుకున్న ఫలితాలు రాబడతారు.
వ్యవసాయదారులకు రెండుపంటలూ సానుకూలం. 
క్రీడాకారులు, వైద్యులు, న్యాయవాదులు ఐటీ రంగం వారు విజయాల వైపు సాగుతారు. 
జనవరి 24 నుంచి ఏల్నాటి శని ప్రారంభం వల్ల మనోక్లేశాలు, వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు, కుటుంబంలో సమస్యలు ఎదురుకావచ్చు. 
ఆదాయం –5, వ్యయం–2, రాజపూజ్యం–5, అవమానం–4.
వీరు జనవరి నుంచి శనీశ్వరునికి తైలాభిషేకాలు, జపాలు చేయించుకుంటే మంచిది. 
అలాగే, ఆంజనేయస్వామిని పూజించండి.
వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, ఫాల్గుణ మాసాలు విశేష లాభదాయకమైనవి.

మీనం
ఈ రాశి వారికి గురువు ఏప్రిల్‌22వరకు దశమంలోనూ, తదుపరి నవంబర్‌4వరకు భాగ్యస్థానమైన వృశ్చికంలోనూ, తదుపరి సంవత్సరాంతం వరకూ దశమమైన ధనుస్సులోనూ సంచారం.
శని జనవరి 23వరకు రాజ్యస్థానమైన ధనుస్సులోనూ, తదుపరి లాభస్థానమైన మకర రాశిలో సంచారం. రాహువు సంవత్సరాంతం వరకూ అర్థాష్టమైన మిథునం, కేతువు దశమమైన ధనుస్సు రాశిలో సంచారం.
వీరికి గురు బలం విశేషం. అలాగే, సంవత్సరాంతంలో శని విశేష లాభదాయకుడు. అయితే రాహుకేతువులు దోషకారులు. మొత్తం మీద వీరికి శుభదాయకంగా ఉంటుంది.
ఆర్థిక పరిస్థితి గతం కంటే మరింత మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీరతాయి. కొన్ని సందర్భాల్లో వద్దంటే డబ్బు అన్నట్లుంటుంది. అయితే ఏదోవిధంగా ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. 
వివాహయత్నాలు కలసివచ్చి ఊరట చెందుతారు.
సంతాన, కుటుంబ సౌఖ్యం. సంతానం ఆరోగ్యం మెరుగుపడుతుంది.
వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. అలాగే, ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు.
బంధువులు, మిత్రులు మీకు వెన్నంటి నిలిచి మీ విజయాలలో భాగస్వాములవుతారు.
కాంట్రాక్టర్లు అనుకున్న దానికంటే అధికంగా లాభాలు పొందుతారు.
తరచూ తీర్థ యాత్రలు చేస్తారు. అలాగే, ధార్మిక కార్యక్రమాలను చేపడతారు.
వ్యాపారులకు అనుకోని విధంగా లాభాలు దక్కుతాయి. నూతన భాగస్వాములు చేరతారు. 
ఉద్యోగస్తులకు విశేష గుర్తిపు లభిస్తుంది. పదోన్నతులు, ఇంక్రిమెంట్లు దక్కుతాయి.
పారిశ్రామికవేత్తల యత్నాలు సఫలమవుతాయి. కొత్త పరిశ్రమల ఏర్పాటులో విజయం.
రాజకీయవేత్తలను అనుకోని పదవులు వరిస్తాయి. సన్మానాలు, పురస్కారాలు.
సినీ, టీవీ కళాకారులు గతం కంటే మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తారు. విశేష గుర్తింపు, ప్రోత్సాహం అందుతాయి.
క్రీడాకారులు, పరిశోధకులు, వైద్యులు తమ సత్తా నిరూపించుకుంటారు. 
విద్యార్థులు ప్రతిభ చాటుకుంటారు. ఉన్నతశ్రేణిలో ఉత్తీర్ణత సాధిస్తారు.
వ్యవసాయదారులు రెండుపంటలూ లాభించి ఉత్సాహంగా గడుపుతారు.
అర్థాష్టమ రాహువు కారణంగా తరచూ శారీరక రుగ్మతలు, మానసిక అశాంతి. బంధువులతో తగాదాలు నెలకొనవచ్చు. అయినవారి నుంచే అవమానాలు ఎదురవుతాయి.
ఆదాయం–2, వ్యయం–8, రాజపూజ్యం–1, అవమానం–7.
వీరు రాహుకేతువులకు పరిహారాలు చేయించుకోవాలి. 
అలాగే, దుర్గామాతకు కుంకుమార్చనలు, 
సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకాలు మంచిది.
చైత్రం, వైశాఖం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, మాఘం మాసాలు మరింత అనుకూలమైనవి.

Vakkantham Chandra Mouli                 
www.janmakundali.com