చిరంజీవి మలి చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో ఖరారయిన సంగతి తెలిసిందే. ఈ పాటికే ఈ చిత్రం మొదలై వుండాల్సింది కానీ 'సైరా'కి సంబంధించిన వర్క్ ఇంకా బ్యాలెన్స్ వుండడంతో కొరటాల చిత్రం లాంఛ్ కొద్ది రోజులు వాయిదా పడింది. ఠాగూర్, స్టాలిన్ తరహాలో సామాజిక సందేశం వున్న ఓ చిత్రాన్ని కొరటాల శివ తీయబోతున్నట్టు సమాచారం.
ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విశేషం ఏమిటంటే… ఈ కథని పవన్‌కళ్యాణ్‌ని దృష్టిలో వుంచుకుని కొరటాల శివ రాసుకున్నాడట. పవన్‌కళ్యాణ్ ఆలోచనలు, ఆశయాలని ప్రతిబింబించేలా ఈ కథ వుండడంతో అతను చేస్తే ఫాన్స్ బాగా కనక్ట్ అవుతారని భావించాడట. అయితే ఈ లైన్ పవన్‌కి చెప్పినపుడు ఇది 'అన్నయ్య'కి బాగుంటుందని పవన్ సజెస్ట్ చేయడంతో కొరటాల శివ ఆ కథని చిరంజీవి వద్దకి తీసుకెళ్లాడట.
రాజకీయాల్లో బిజీ కావాలనే ఆలోచన వుండడంతో, ఇక సినిమాలపై ఆసక్తి లేకపోవడంతో పవన్ ఆమధ్య చాలా ఆఫర్లు వదిలేసుకున్నాడు. అయితే అతను మళ్లీ సినిమాలు చేస్తాడా లేదా అనేది ఈ ఎన్నికలలో జనసేన పర్ఫార్మెన్స్పై ఆధారపడి వుంది. అందుకే ఇంకా తనకి అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతలు ఎవరికీ పవన్ డబ్బులు వాపసు ఇవ్వలేదు.