మజిలీ డే వన్ అయిదుకోట్లు

సరైన సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న తెలుగు ప్రేక్షకులకు ఓ పెద్ద రిలీఫ్ లా కనిపించింది మజిలీ. ఆకలితో వున్నవాడికి అన్నమే పరమాన్నం అన్నట్లుగా థియేటర్ల మీద పడ్డారు. నాగచైతన్యకు తొలిరోజు…

సరైన సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న తెలుగు ప్రేక్షకులకు ఓ పెద్ద రిలీఫ్ లా కనిపించింది మజిలీ. ఆకలితో వున్నవాడికి అన్నమే పరమాన్నం అన్నట్లుగా థియేటర్ల మీద పడ్డారు. నాగచైతన్యకు తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో అయిదు కోట్ల మేరకు ఓపెనింగ్స్ వచ్చాయి. ముందుగా కాస్త అటు ఇటుగా థియేటర్లు పెట్టిన బయ్యర్లు, అర్జెంట్ గా థియేటర్లు పెంచే పనిలో పడ్డారు.

ఆంధ్ర ఎనిమిది కోట్ల రేషియోలో అమ్మితే, కాస్త అటు ఇటు అనుమానం పడ్డారు విడుదలకు ముందు. అలాంటది ఇప్పుడు ట్రెండ్ చూస్తే, తొలివారంతో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఎన్నికల హోరు లేకుంటే అంతకన్నా ముందే బ్రేక్ ఈవెన్ అయ్యేది. కానీ ఇప్పుడు మాత్రం ఫస్ట్ వీక్ పూర్తి కావాల్సిందే.

తొలిరోజు కలెక్షన్ల వివరాలు
నైజాం………1.85
సీడెడ్……….0.63
వైజాగ్……….0.76
ఈస్ట్………….0.27
వెస్ట్………….0..25
కృష్ణా…………0.37
గుంటూరు….0.66
నెల్లూరు…….0.17