నాగశౌర్య డంబ్ అండ్ డఫ్

ఒక్కసారిగా ఊపు అందుకుంది హీరో నాగ శౌర్య కెరీర్. ఒకేసారి అరడజను సినిమాలు చేతిలో వున్నాయి. ఇవి కాక మరో మంచి ప్రాజెక్టు డిస్కషన్ లో వుంది. Advertisement బాలకృష్ణ కాంబినేషన్ లో ఓ…

ఒక్కసారిగా ఊపు అందుకుంది హీరో నాగ శౌర్య కెరీర్. ఒకేసారి అరడజను సినిమాలు చేతిలో వున్నాయి. ఇవి కాక మరో మంచి ప్రాజెక్టు డిస్కషన్ లో వుంది.

బాలకృష్ణ కాంబినేషన్ లో ఓ మాంచి సినిమా డిస్కషన్ స్టేజ్ లో వుంది. ఈ సినిమాలో శౌర్యది నలభై నిమషాల కీలక పాత్ర అని తెలుస్తోంది.

సినిమా మొత్తం శౌర్య మూగ-చెమిటి వాడిగా వుంటాడని తెలుస్తోంది. అయితే ఈ పాత్ర ఎమోషనల్ గా కాకుండా ఫన్ తో వుంటుందని బోగట్టా.  సినిమాలో సుమారు 45 నిమషాల పాటు ఈ పాత్ర వుంటుంది. బాలకృష్ణ పాత్ర పూర్తి నిడివితోవుంటుంది.

కుమారి 21 ఎఫ్ సినిమాను కన్నడంలో రూపొందించిన దర్శకుడు శ్రీమన్ వేముల ఈ సినిమా కథ తయారుచేసారు. బాలయ్యకు చెప్పడం జరిగింది.

ఒకె అన్నారు కానీ ఎటొచ్చీ బాలయ్య ఇంకా ఏ నిర్ణయం తెలియచేయలేదు ఎప్పటి నుంచి చేస్తారు? ఏమిటి సంగతి అన్నది ఇంకా తెలియాల్సి వుంది. 

బిగ్ బాస్ విన్న‌ర్ ఎవ‌రో నాకు తెలుసు