తనను ప్రశ్నించే వారు లేరంటే ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఎవరినైనా ఏమైనా మాట్లాడుతారు. అదే ఎదురుగా కాస్తా నోరున్న ప్రత్యర్థి నాయకులున్నారంటే ఒళ్లు, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడ్తారు.
తాజాగా ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డిపై ఎమ్మెల్సీ అశోక్‌బాబు తన నోటి దురుసును ప్రదర్శించారు. అందుకే ఆయనతో అడ్జెంట్‌గా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో మాట్లాడించాలని పలువురు వ్యంగ్యంగా అంటున్నారు.
ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మంగళవారం రాజధాని అమరావతి అంశంపై మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్‌రెడ్డికి ఎమ్మెల్సీ అశోక్‌బాబు కౌంటర్ ఇచ్చారు. తమ ప్రభుత్వం ఏం చేసినా ప్రజలు నమ్ముతారనే పిచ్చి ఆలోచనలు ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మానుకోవాలని అశోక్‌బాబు హెచ్చరించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు కుల రాజకీయాలు చేశాడని చెప్పడానికి.. అసలు శ్రీకాంత్‌రెడ్డికి సిగ్గుందా? అని అశోక్‌బాబు నోరు పారేసుకున్నారు. రాయలసీమకు చంద్రబాబు ఏమీ చేయలేదని చెప్పేముందు.. శ్రీకాంత్‌రెడ్డి పులివెందుల రైతులను అడిగితే.. అతను సిగ్గుతో తలొంచుకునేలా వారే సమాధానం చెబుతారని అశోక్‌బాబు వ్యాఖ్యానించడం గమనార్హం. పదేపదే అశోక్‌బాబు సిగ్గుందా అని అనడాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
ప్రత్యర్థులపై దురుసుగా విమర్శలు చేయడం అశోక్‌బాబుకు కొత్తేమి కాదు. ఈ ఏడాది జూన్ 19న రాజ్యసభ ఎన్నికల అనంతరం టీవీ9 బిగ్ డిబేట్ నిర్వహించింది. ఈ చర్చలో టీడీపీ ప్రతినిధిగా అశోక్‌బాబు మాట్లాడుతూ తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయని ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల గురించి అవాకులు చెవాకులు పేలారు. దీంతో చర్చ కాస్తా రచ్చ అయింది.
అంత వరకూ నోటికి హద్దు అదుపూ లేకుండా మాట్లాడిన అశోక్‌బాబు, లైన్‌లోకి వచ్చిన వంశీ దెబ్బకు విలవిలలాడిపోయాడు. ఆ రోజు డిబేట్‌లో టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు మాట్లాడుతూ అటుఇటూ గాని వాళ్లంతా టీడీపీని భ్రష్టు పట్టిస్తున్నారని, వీళ్లంతా దమ్ములేని నాయకులని తీవ్ర పదజాలంతో దూషించారు. ఈ చర్చను ఫాలో అవుతున్న వల్లభనేని వంశీ అకస్మాత్తుగా లైవ్‌లోకి వచ్చారు.
తాను 2004 నుంచి రాజకీయాల్లో ఉన్నానని, అశోక్‌బాబు కొత్తగా వచ్చాడన్నారు. “నేనేంటో, నా మగతనం ఏంటో మూడు ఎలక్షన్లలో జనం చూశారు. అశోక్‌బాబుకి ప్రత్యేకంగా మగతనం కావాలంటే, చూపెట్టాలంటే అది వేరే సంగతి. నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది. ఒళ్లు హద్దులో పెట్టుకుని మాట్లాడు. ఎవరు నువ్వు? నా మగతనంపై మాట్లాడుతున్నావ్ అశోక్‌బాబు”
“ఆప్ట్రాల్ వృద్ధ నారీ పతీవ్రతలాగా ఉద్యోగం అయిపోయాక వచ్చావు. నీకు ఒళ్లు కొవ్వెక్కి, ఏది పడితే అది మాట్లాడి .మగతనం ఉండి రాజకీయాలు చేయమనడం…ఏంటయ్యా మగతనం”
ఇలా సాగింది అశోక్‌బాబుపై వల్లభనేని వంశీ దాడి. కానీ అశోక్‌బాబులో ఏ మాత్రం మార్పురాలేదు. వ్యక్తిగత దూషణలు చేయడం వల్ల చంద్రబాబు దృష్టిలో పడొచ్చనే ఛీప్ ట్రిక్స్‌కు అశోక్‌బాబు పాల్పడుతున్నారనే అభిప్రాయాలు లేకపోలేదు. విధానపరంగా విమర్శలు చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ సిగ్గుందా, మగతనం ఉందా? లాంటి అభ్యంతరకర వ్యాఖ్యల వల్ల ఇబ్బందంతా?
తాజాగా శ్రీకాంత్‌రెడ్డిపై కూడా అశోక్‌బాబు తన స్థాయికి మించి విమర్శలు చేయడం గమనార్హం. మళ్లీ ఆయనకు సమాధానం కావాలంటే వల్లభనేని వంశీని దింపాల్సిందే అంటూ నెటిజన్లు చమత్కరిస్తుండడం గమనార్హం. వెంటనే అశోక్‌బాబుకు వంశీతో ఫోన్ కలపాలంటున్నారు.