సూర్యదేవర నాగవంశీ, హారిక హాసిని బ్యానర్ నిర్మాతల్లో ఒకరు. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో త్వరలో ఓ సినిమా చేయబోతున్నారు. కానీ ఈ లోగానే ఎన్టీఆర్ సినిమాను తన చేతుల్లోకి తీసుకున్నారు. బాబీ డైరక్షన్ లో ఎన్టీఆర్ చేస్తున్న జై లవకుశ సినిమా యుఎస్ హక్కులను నాగవంశీ, ఆయన మిత్ర బృందం కలిసి తీసుకున్నట్లు తెలుస్తోంది.
కేవలం యుఎస్ కోసం 10.5 కోట్లు కోట్ చేసారు వారు. ఇప్పటికి వచ్చిన హయ్యస్ట్ కోట్ అదే. అందుకే వారికే ఫైనల్ చేయాలని నిర్మాత కళ్యాణ్ రామ్ ఫిక్సయినట్లు తెలుస్తోంది. జస్ట్ ఫైనల్ డిస్కషన్ అండ్ అగ్రిమెంట్ మాత్రం బాకీ వుంది. స్పైడర్ తెలుగు, తమిళ హక్కులు కలిపి 15.5 కోట్లకు వెళ్లాయి. ఎన్టీఆర్ సినిమా కేవలం తెలుగు హక్కులు 10.5కు అంటే మంచి రేటు అనే చెప్పుకోవాలి.
ఇదిలా వుంటే జై లవకుశ సింగపూర్ హక్కులను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సంస్థ 18 లక్షలకు కోనుగోలు చేసింది. ఈ సంస్థ కళ్యాణ్ రామ్ హీరోగా సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మిగిలిన వరల్డ్ వైడ్ ఏరియాలు కూడా ఇలా పీస్ మీల్ పద్దతిన విక్రయించే పనిలో వున్నారు నిర్మాత కళ్యాణ్ రామ్.