మెగా మామయ్యల అడుగు జాడల్లో నడుస్తున్నాడు సాయిధరమ్ తేజ. త్వరలో తేజు చేయబోయే ఓ సినిమా మరోసారి ఈ విషయాన్ని ప్రూవ్ చేస్తుందట.
మెగాస్టార్ చిరంజీవి తన ఎర్లీ డేస్ లో చకచకా సినిమాలు చేస్తున్నపుడు వచ్చిన మూవీ కోతల రాయుడు. మాంచి మాస్ మసాలా హీరో క్యారెక్టర్ అది. ఇప్పుడు అచ్చం అలాంటి క్యారెక్టర్ నే సాయిధరమ్ కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది.
తన అవసరాల కోసం కోతలు కోస్తూ, నలుగురిని బుట్టలో వేసే కుర్రాడి క్యారెక్టర్ ఒకటి దర్శకుడు మారుతి తయారు చేసాడని తెలుస్తోంది.
అయితే అబద్దాలు మాత్రం చెప్పకుండా కోతలు కోయడం, మోసం చేయడం అన్నమాట. అబద్దం చెప్పకుండా కోతలు కోయడం ఏలా? అదే కాన్సెప్ట్ అన్నమాట.
గీతాఆర్ట్స్ పతాకంపై నిర్మించే ఈ సినిమాకు సాయిధరమ్-మారుతి ఇద్దరూ రెడీ. మరి ఎప్పుడు పట్టాలు ఎక్కుతుందో మరి?
ప్రస్తుతం నక్షత్రం, జవాన్ సినిమాలు ఫినిష్ చేసిన తేజు సెప్టెంబర్ నుంచి వివి వినాయక్ డైరక్షన్ లో సినిమా చేయబోతున్నారు.