cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

నాగబాబు అస్సలు తగ్గట్లేదుగా

బాలయ్య ఫ్యాన్స్-నాగబాబు వివాదం ఇప్పట్లో ఆగేలాలేదు. ఫేస్ బుక్ లో నాగబాబు పోస్ట్ లు, వివరణలు ఆగడంలేదు. లేటెస్ట్ గా తనే పాల్గొన్న ఓ షార్ట్ ఫిలింను లోడ్ చేసారు. అలాగే నేరుగా పెద్ద వివరణ విడియోను కూడా లోడ్ చేసారు. ఎప్పుడో బాలయ్య సినిమా ఫంక్షన్ లో అన్న డైలాగ్ ఆధారంగా షార్ట్ ఫిలిం చేసారు.

ఆడపిల్ల కనిపిస్తే ముద్దయినా పెట్టాలి, కడుపయినా చేయాలి అని అన్న బాలయ్య మాటను తీసుకుని, షార్ట్ ఫిలిం తయారుచేసారు. బాలయ్య మాట పట్టుకుని ఓ కుర్రాడు అమ్మాయిల మీద పడితే, వాళ్లు అతగాడికి దేహశుద్ది చేయడం అన్నది ఆ షార్ట్ ఫిలిం కాన్సెప్ట్.

అలాగే మరో వివరణ ఇచ్చారు. తాను నేరుగా పేరు ప్రస్తావించకున్నా, ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు అంటూ విడియో వివరణ ఇచ్చారు. అంతేకాదు, 2011లో చిరంజీవిని ఏమన్నారో గుర్తుచేసి, దానికి ఇప్పుడు సరైన సమాధానం చెప్పి, ఈ వివాదానికి ముగింపు పలుకుతా అని వివరించడం విశేషం. 

నిజానికి 2011లోనే ఘాటుగా సమాధానం ఇద్దామనుకున్నామని, కానీ తన అన్నయ్య ధర్మరాజులా తమను ఎప్పటికప్పుడు శాంతం, శాంతం అని కూర్చో పెట్టడంతో వీలుకాలేదని నాగబాబు వెల్లడించారు. బాలకృష్ణ ఆరుసార్లు అంటే స్పందించని మీడియా, తను ఒక్కసారి అంటే అంత డిస్కషన్లు, హడావుడి ఏంటంటూ నాగబాబు చిన్న చురక వేయడం విశేషం.

జగన్‌తో పవన్‌ పొత్తు ఎందుకు కుదరలేదంటే?

టికెట్ దక్కకపోతే డబ్బులు మిగులుతాయ్!