Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చంద్రబాబు సినిమా చూస్తారట

చంద్రబాబు సినిమా చూస్తారట

బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్  కథానాయకుడు. ఈ సినిమా నిన్న విడుదలై క్రిటిక్స్ ప్రశంసలు అందుకుంది. రాజకీయాల్లో బిజీగా వున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కాస్త తీరిక చేసుకుని, తన మామగారి బయోపిక్ ను ఈ రోజు చూస్తారట. అందుకోసం విజయవాడ ట్రెడెంట్ మాల్ లో ఏర్పాట్లు చేస్తున్నారు.

వాస్తవానికి సినిమా ప్రారంభించడానికి ముందే చంద్రబాబు పాత్రధారి రానా, డైరక్టర్ క్రిష్ అమరావతి వెళ్లి, ఆయన ఇన్ పుట్స్ తీసుకున్నారు. బాబుకు స్క్రిప్ట్ మొత్తం నెరేట్ చేసే వుంటారు. మరి ఆ స్క్రిప్ట్ సినిమాగా ఎలా వచ్చిందా? తనపాత్రలో రానా ఎలా వున్నాడా? అన్న కుతూహలం వుండనే వుంటుంది.

అందుకే ఈరోజు చంద్రబాబు ఎన్టీఆర్ బయోపిక్ చూస్తారట. బావతో పాటు తనూ చూసేందుకు బాలయ్య బయల్దేరి విజయవాడ వెళ్లారని బోగట్టా. నిన్నటికి నిన్న నందమూరి కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కలిసి ఎఎమ్ బి మాల్ లోని రెండు స్క్రీన్లలో సినిమాను చూసిన సంగతి తెలిసిందే.

అనుభవంలేని క్రిష్‌, సాయిమాధవ్‌... ప్రకాష్‌రాజ్‌, మురళిశర్మలతో పోటీపడ్డారా?

హరికృష్ణ పాత్ర జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సింది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?