రేణుదేశాయ్ కు బాలేదా?

సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న అంశమైనా వార్తగా మారి కూర్చుంటుంది. అభిమానుల ఆసక్తి కూడా ఆ రేంజ్ లోనే వుంటుంది. అందువల్లే సెలబ్రిటీలకు ఇబ్బంది అయినా, మీడియా వాళ్ల జీవితాల కేసి ఫోకస్ పెట్టే…

సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న అంశమైనా వార్తగా మారి కూర్చుంటుంది. అభిమానుల ఆసక్తి కూడా ఆ రేంజ్ లోనే వుంటుంది. అందువల్లే సెలబ్రిటీలకు ఇబ్బంది అయినా, మీడియా వాళ్ల జీవితాల కేసి ఫోకస్ పెట్టే వుంటుంది. లేటెస్ట్ గ్యాసిప్ ఒకటి ఇలాగే ఓ సెలబ్రిటీకి సంబంధించి వినిపిస్తోంది. ఆ సెలబ్రిటీ ఎవరోకాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీభార్య, నటి, నిర్మాత రేణు దేశాయ్.

ఆమెకు ఆరోగ్యం బాగాలేదన్న గ్యాసిప్ వినిపిస్తోంది. ఇదెలా బయటకు వచ్చిందంటే, ఓ తెలుగు నిర్మాత తను తీస్తున్న సినిమాలో తల్లిపాత్ర కోసం రేణుదేశాయ్ ను అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది. ఆమె తెలుగులోకి మళ్లీ వస్తే ఆ క్రేజ్ వేరుగా వుంటుందని, పైగా సినిమాకు ప్లస్ అవుతుందని భావించారట ఆ నిర్మాత.

కానీ ఆమె ఆ ప్రతిపాదనను తిరస్కరించారని, దానికి కారణంగా ఆమె తన ఆరోగ్యం సరిగ్గాలేదని, కొన్నాళ్లు రెస్ట్ అవసరమని చెప్పారని వినిపిస్తోంది. దాంతో ఆ నిర్మాత ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. వాస్తవానికి ఆ నిర్మాతకు రేణుదేశాయ్ తో మంచి స్నేహమే వుంది.

ఆయన అడిగితే మొహమాటానికైనా ఓకె అనే పరిస్థితే. కానీ వాస్తవంగానే ఆరోగ్యం బాగాలేక, నో చెప్పారని తెలుస్తోంది.

అనుభవంలేని క్రిష్‌, సాయిమాధవ్‌… ప్రకాష్‌రాజ్‌, మురళిశర్మలతో పోటీపడ్డారా?

హరికృష్ణ పాత్ర జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సింది