నాగబాబు- వరుణ్.. బలి?

ఫ్యాన్స్ ను తక్కవ అంచనా వేశారు. వాళ్ల అభిమానం ఒక్కోసారి హద్దులు మీరుతుంటుంది. అయినా పళ్ల బిగువన సహించాలి. అప్పటికీ లోపల ఎలా వున్నా, మా కుటుంబసభ్యులు, మా గుండెల్లో వున్నారు లాంటి సినిమా…

ఫ్యాన్స్ ను తక్కవ అంచనా వేశారు. వాళ్ల అభిమానం ఒక్కోసారి హద్దులు మీరుతుంటుంది. అయినా పళ్ల బిగువన సహించాలి. అప్పటికీ లోపల ఎలా వున్నా, మా కుటుంబసభ్యులు, మా గుండెల్లో వున్నారు లాంటి సినిమా డైలాగులు వల్లిస్తూనే వుంటారు.

కానీ అదే అభిమానులను చూడ్డానికి కూడా రానివ్వరు. కొందరు హీరోలతే చిరాకు పడతారు..తిడతారు..కొడతారు కూడా. అదే ఎన్టీఆర్ కాలంలో అయితే ఉదయాన్నే ఫ్యాన్స్ ఇంటికి రావడం కోసం ఓ టైమ్ అంటూ కేటాయించేవారు. టూరిస్టు బస్సుల్లో వచ్చేవారిని పలకరించేవారు. కానీ ఇప్పుడలా కాదు. 

కానీ మెగాక్యాంప్ మాత్రమే ఫ్యాన్ బేస్ ను చాలా కరెక్ట్ గా చూసుకుంటుంది. వారితో కాస్త రెగ్యులర్ ఇంట్రాక్షన్ వుంటుంది. సినిమా విడుదల ముందు భోజనాలు, పలకరింపులు వుంటాయి. కానీ ఇటీవల కొంత కాలంగా పవర్ స్టార్, మెగాస్టార్ ఎడమొహం, పెడ మొహంగా వున్నారన్న భావన కలిగినప్పటి నుంచీ ఫ్యాన్స్ వైఖరిలో మార్పువచ్చింది. పవర్ స్టార్ అంటూ మెగా ఫంక్షన్లలో హడావుడి చేయడం పెరిగింది. ఇది పెరిగి పెరిగి, ఆఖరికి చిరు షష్టిపూర్తి ఫంక్షన్ లో నాగబాబు బరస్ట్ అయి ఆగ్రహించేవరకు వెళ్లింది. 

అక్కడితో ఆగలేదు..బ్రూస్ లీ అడియో ఫంక్షన్ పాసుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నారని వినికిడి. ఫ్యాన్స్ అందు ఫవర్ ఫ్యాన్స్ వేరయా అన్నట్లు, వారికి పాసులు అందకుండా జాగ్రత్త పడ్డారు. ఫంక్షన్ కామ్ గా స్మూత్ గా జరిగిపోయింది. 

కానీ, ఇప్పుడు బ్రూస్ లీ విడుదలై, ఫలితం తేడా వచ్చేసరికి, మెగా క్యాంప్ దృష్టి ఫ్యాన్స్ మీదకు మళ్లింది. సినిమా సెకండాఫ్ లో కథ, కథనాలు తన్నేసాయన్న సంగతి పట్టించుకోవడం లేదు. ఫ్యాన్స్ చూడలేదా? ఎందుకు చూడలేదు? ఇదే ఆలోచన.

తెలంగాణ ప్రాంత ధియేటర్ కు ముస్తాబు చేయమంటే ఓ మెగా వీరాభిమాని ఇలా అన్నాడట..''రెండు వారాల క్రితం పదివేలు ఖర్చు చేసాం..వారం క్రితం పది వేలు ఖర్చుచేసాం..ఇప్పుడు మరో పదివేలు..వచ్చేవారం ఇంకో పదివేలు…ఇలా ప్రతివారం మెగా సినిమాలకు ఎక్కడ నుంచి డబ్బులు తెమ్మంటారు..'అని? ఇదీ పాయింటే. 

సరే కథ కథానాల సంగతి వదిలి ఫ్యాన్స్ సంగతి దగ్గరకు వచ్చేసరి, ఆ రోజు కోప్పడింది నాగబాబు కాబట్టి, ఆయనను దూరం పెట్టేసారు. పైగా బ్రూస్ లీ మీద వారం తిరక్కుండానే నాగబాబు కొడుకు సినిమా వస్తోంది..అది కూడా కోపకారణంగా వుందని వినికిడి. ఇప్పుడు మెగా, పవర్ ఒక్కటయ్యారు. నాగబాబును దూరం వుంచారు. మెగా క్యాంప్ లో ఎప్పటికైనా అందగాడు వరుణ్ అని పేరు ఇప్పటికే వచ్చింది. అది కూడా ఓ కారణంగా తెలుస్తోంది. 

ఇదిలా వుంటే, తను కష్టపడి పెంచుకున్న చరిష్మాను అందరూవాడేసుకుంటున్నారని, తన కొడుక్కు మాత్రమే అది ఉపయోగపడాలని చిరంజీవి కొరుకుంటున్నారని ఓ టాక్ వుంది. రేసుగుర్రం హిట్ దగ్గర నుంచి మెగా క్యాంప్ లో కనిపించని గోడలు లేస్తున్నాయన్న టాక్ కూడా వుంది. ఇప్పుడు పవన్ ఫ్యాన్ బేస్ ను మెగా ఫ్యాన్ బేస్ ను కలిపి, చరణ్ కు ఉపయోగపడేలా చేయాలన్న ప్రయత్నాలు షురూ అయ్యాయి. అందులో భాగంగా చరణ్ తో పవన్ సినిమా నిర్మిస్తారు. 

బన్నీ వీరందరికీ అతీతంగా తనకంటూ ఓ మాంచి ఫ్యాన్ బేస్ తయారుచేసేసుకున్నారు. పైగా బన్నీ అండగా మాస్టర్ మైండ్ అరవింద్ వున్నారు. సో నో ప్రాబ్లమ్. సాయి ధరమ్ తేజ్ ఎలాగూ పవన్ క్యాంప్ మనిషే.  ఇక మిగిలిపోయింది.. నాగబాబు.. ఆయన కోడుకు వరుణ్ తేజ. సరైన సినిమాల చేయడమే వారి రక్ష.