బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీష్రాఫ్ కూతురు కృష్ణా ష్రాఫ్ కోరుకుంటున్న తరహా పబ్లిసిటీ ఏమిటో అర్ధమైపోతోంది. ఇప్పటికే రెండు మార్లు తన హాఫ్ న్యూడ్ ఫొటోల పోస్టింగ్‌లతో సంచలనం సృష్టించిన ఈ చిన్నది… ఇప్పుడు ఆ ఫొటో ఫోజులకు తగ్గట్టుగానే మాటలూ వదులుతూ మీడియాకు చేతినిండా పనిపెడుతోంది.
తాజాగా సదరు ఫొటోల గురించి డిఎన్ఎ తో మాట్లాడిన కృష్ణా ష్రాఫ్… ఆ ఇంటర్వ్యూలో తన ఫొటోలు టాప్‌లెస్‌గా ఉన్నాయంటే తాను ఒప్పుకోనని చెప్పింది. అసలు టాప్‌లెస్ అంటే మీకు అర్ధం తెలుసా? అంటూ విశ్లేషణలోకి దిగింది. పై భాగం పూర్తి గా నగ్నంగా ఉన్నంత మాత్రాన టాప్‌లెస్ అనకూడదని, తన ఫొటోల్లో తాను నిపుల్‌ని చూపించలేదని గుర్తు చేసింది. కాబట్టి ఆ ఫొటోలను టాప్‌లెస్ అని వర్ణించడం కరెక్ట్ కాదని అభిప్రాయపడింది. బహుశా ఇప్పటిదాకా ఏ బాలీవుడ్ భామా ఈ స్థాయిలో తమ ప్రైవేట్ బాడీ పార్ట్ గురించి మాట్లాడిన దాఖలా లేకపోవడంతో… ఈ అమ్మడి మాటలు మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి.
సరే… ఇంత హడావిడి చేస్తున్నావ్… సినిమాల్లోకి ఎప్పుడొస్తావ్? అని ప్రశ్నిస్తే… అసలు అందంగా ఉన్న అమ్మాయి అనగానే సినిమాల్లోకి రావడం అనే ఎందుకు ఆలోచిస్తారో తనకర్ధం కాదంటూ తన అందానికి తానే కితాబిచ్చేసుకుంది. తండ్రి, అన్నయ్యల షూటింగ్‌లు చూశా కాబట్టి తనకు నటన గురించి అందులోని కష్టనష్టాల గురించి తెలుసంది. అందుకేనేమో… పెద్ద కష్టపడకుండానే ఎంట్రీకి ముందు పబ్లిసిటీ తెచ్చేసుకుందామని ఇలాంటి ఫొటోలు, మాటలు వదులుతోందన్నామాట.