అల్లు అరవింద్ కు నాగార్జున ఆర్థికసాయం?

గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై ఈ నెలలోనే ప్రారంభం కానుంది అఖిల్ కొత్త సినిమా. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాతో దర్శకుడిగా రీఎంట్రీ ఇస్తున్నాడు. అల్లు అరవింద్ నిర్మాత. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ ప్రాజెక్టులో…

గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై ఈ నెలలోనే ప్రారంభం కానుంది అఖిల్ కొత్త సినిమా. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాతో దర్శకుడిగా రీఎంట్రీ ఇస్తున్నాడు. అల్లు అరవింద్ నిర్మాత. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ ప్రాజెక్టులో నాగార్జున కూడా పెట్టుబడి పెట్టబోతున్నాడట. ఇదేదో లాభం కోసం నాగార్జున చేస్తున్న పనికాదు. కొడుకు కోసం నాగ్ సహ-నిర్మాతగా మారబోతున్నాడట.

ఈ ప్రాజెక్టుపై నమ్మకంతో నాగార్జున డబ్బులు పెట్టడంలేదట. అల్లు అరవింద్ ఫిక్స్ చేసిన బడ్జెట్ కంటే ఇంకాస్త ఎక్కువే ఖర్చు అవుతుందట. అఖిల్ సినిమాకు అంత బడ్జెట్ పెట్టనని, ప్రొడక్షన్ తగ్గించమని సూచించాడట అరవింద్. సరిగ్గా ఇక్కడే సీన్ లోకి ఎంటరయ్యాడు నాగ్.

అసలే హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు అఖిల్. ఇలాంటి టైమ్ లో సినిమా క్వాలిటీ తగ్గితే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఆ అదనపు బడ్జెట్ ఏదో తనే పెడతానని, మేకింగ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వొద్దని అల్లు అరవింద్ కు మాటిచ్చాడట నాగ్.

సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ నుంచే కాస్ట్ కటింగ్ ఫాలో అవుతున్నారు. అఖిల్ కు పారితోషికం లేదు. రిలీజ్ తర్వాత అతడికేదో గిఫ్ట్ రూపంలో సర్దుబాటు చేస్తారట. ఇక బొమ్మరిల్లు భాస్కర్ సంగతి సరేసరి. అతడికి సినిమా ఛాన్స్ రావడమే ఎక్కువ అన్నట్టుంది పరిస్థితి. సంగీత దర్శకుడిగా కూడా ముందు దేవిశ్రీ ప్రసాద్ ను అనుకొని గోపీసుందర్ ను తీసుకున్నారు.

హీరోయిన్ ను మాత్రం కాస్త క్రేజ్ ఉన్న అమ్మాయిని పెట్టాలని చూస్తున్నారు. కానీ ఇక్కక కూడా అరవింద్ లెక్కలేస్తున్నట్టు తెలుస్తోంది. లాంచ్ తర్వాత హీరోయిన్ డీటెయిల్స్ బయటకొస్తాయి.

మరీ దెబ్బతినని మోడీ ఇమేజ్… కోలుకున్నా పుంజుకోని కాంగ్రెస్!