సినిమా రంగంలో ఫ్యామిలీలు కొన్ని వున్నాయి..నందమూరి, దగ్గుబాటి, అక్కినేని, కొణిదెల.. అల్లు.. ఇలా. వీటన్నింటికీ ఇండస్ట్రీలో కాస్త పేరు వుంది. ఆ పేరును నిలబెట్టుకోవడానికి ఆ కుటుంబాలు చాలా జాగ్రత్తలు తీసుకుంటాయి..అక్కినేని ఫ్యామిలీలో వెంకట్..నాగార్జున ఇద్దరు మగ పిల్లలు..మరో ఇధ్దరు అమ్మాయిలు..అంతా ఓ ఫ్యామిలీ మాదరిగానే కనిపిస్తూ వుంటారు.
ఇప్పుడు నాగ్ కు ఇద్దరు పిల్లలు. ఈ ఇద్దరి పిల్లల మధ్యన ఎప్పుడయినా పొరపొచ్చాలు వస్తాయేమో? లేదా తాను ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ చేస్తున్నానన్న ఫీలింగ్ ఎక్కడన్నా వస్తుందేమో? అని నాగ్ సదా జాగ్రత్తలు తీసుకుంటూ వుంటారట. ఈ విషయమై నాగ్ తో కాస్త మంచి పరిచయమే వున్న కొందరు చెప్పిన విషయాలు వింటే ఆశ్చర్యం వేస్తుంది.
అఖిల్ సినిమాలో ‘కన్నెకొట్టరో..పాల పిట్టరో’ పాటను రీమిక్స్ చేయాలని అనుకున్నాడట దర్శకుడు వివి వినాయక్. అదే విషయం నాగ్ కు చెప్పాడట. వెంటనే నాగ్..ఆ పాట వద్దు..ఇంకేదైనా చేసుకోండి..ఆ పాటను చై సినిమాలో రీమిక్స్ చేస్తానని మాటిచ్చా…అన్నాడట. కాదు..అని వినాయక్ పట్టుపడితే..జస్ట్ ఒకటి రెండులైన్లు మాత్రం వాడుకోండన్నాడట.
అఖిల్ సినిమా సమయంలోనే ఫ్యాన్స్ ఓ వెబ్ సైట్ తయారీకి పూనుకున్నారట. అఖిల్ ఫ్యాన్స్ డాట్ కామ్ అంటూ. ఆ సంగతి తెలిసి..నాగ్ వెంటనే వాళ్లకు కబురు పెట్టి..వద్దని మెత్తగా చెప్పాడట. చై అయినా, అఖిల్ అయినా..నాగ్ ఫ్యాన్స్ లో పార్ట్ తప్ప, వేరేవద్దు అని నచ్చ చెప్పాడట.
అఖిల్, చైతన్య బాగానే వుంటారని, అలాగే ఎప్పటికీ వుండాలని నాగ్ ప్రతి చిన్న విషయంలోనూ కేర్ తీసుకుంటాడని దగ్గరి వాళ్లు చెబుతున్నారు. చై సినిమాల షెడ్యూళ్లు…వెళ్లి వచ్చే ఫ్లయిట్ టైమ్ లు అన్నీ కూడా ఎప్పటికప్పుడు టచ్ లో వుండి తెలుసుకుంటూ, జాగ్రత్తలు తీసుకుంటాడట నాగ్. సినిమాలు..సంపాదన..హిట్ లు ఇన్నీ పక్కన పెట్టండి..నాకు మంచి ఫ్యామిలీ లైఫ్ వుండాలనుకున్నాను..వుండేలాచూసుకుంటాను..మీరయినా అదే చేయాలి అని తన దగ్గర వాళ్లతో పదే పదే అంటుంటాడట నాగ్.