Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నాగేశ్వర రెడ్డికి డోర్స్ క్లోజ్?

నాగేశ్వర రెడ్డికి డోర్స్ క్లోజ్?

వెరైటీగా వుంటుంది, పటాస్ లా ఫన్ ఎంటర్ టైనర్ లా వుంటుంది, అని డైరక్టర్ నాగేశ్వర రెడ్డితో సినిమా చేయాలని అనుకున్నాడు హీరో కళ్యాణ్ రామ్. ఈ నిర్ణయం ఇప్పటిది కాదు. ఆటాడుకుందాం రా డభేల్ మనక పూర్వం అనుకున్నది. స్క్రిప్ట్ మీద వర్క్ జరుగుతోంది. అయితే ఆటాడుకుందాం రా ఫట్ మన్నాక కూడా, సర్లే చూద్దాం అనే అనుకున్నాడు కళ్యాణ్ రామ్ అని వినికిడి.

కానీ తీరా ఇప్పుడు ఇంట్లో దెయ్యం..నాకేం భయ్యం సినిమా రిజల్ట్ చూసాక, ఇక ఆ స్క్రిప్ట్ సంగతి పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. సినిమా కమర్షియల్ విజయం సంగతి అలా వుంచితే, సినిమాలో విషయం ఏమేరకు వుంది, డైరక్టర్ స్టామినా ఏ మేరకు కనిపిస్తోంది అన్న దానిపై ఫీడ్ బ్యాక్ తీసుకున్న తరువాత, కళ్యాణ్ రామ్ ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేసినట్లు టాక్ వినిపిస్తోంది. 

ప్రస్తుతం ఒకరిద్దిరు కొత్త డైరక్టర్లతో స్టోరీ డిస్కషన్లు చేస్తున్న కళ్యాణ్ రామ్, గతంలో నారా రోహిత్ తో సినిమా చేసిన పవన్ సాధినేనికి ఓ స్క్రిప్ట్ ఓకె చేసాడు. దాని సెకండాఫ్ ఇంకా డిస్కషన్ లో వుంది. అది లాక్ అయితే ముందు అదే సెట్ మీదకు వెళ్లే అవకాశం వుంది. ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ రోల్ కు నందమూరి హరికృష్ణ ను అనుకుంటున్నారు. కాదు అంటే అదర్ లాంగ్వేజ్ నుంచి మంచి నటుడని ఎవర్నైనా తీసుకు వచ్చే అవకాశం వుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?