‘నక్కిన’ మరికొంత కాలం వెయిటింగ్ లోనే

నేను లోకల్, హలో గురూ ప్రేమకోసమే సినిమాల తరువాత నుంచి వెయిటింగ్ లో వున్నారు డైరక్టర్ నక్కిన త్రినాధరావు. దాదాపు రెండేళ్లుగా ఖాళీ. పోనీ అలా అని అడ్వాన్స్ లు, నిర్మాతలు లేరా అంటే…

నేను లోకల్, హలో గురూ ప్రేమకోసమే సినిమాల తరువాత నుంచి వెయిటింగ్ లో వున్నారు డైరక్టర్ నక్కిన త్రినాధరావు. దాదాపు రెండేళ్లుగా ఖాళీ. పోనీ అలా అని అడ్వాన్స్ లు, నిర్మాతలు లేరా అంటే బోలెడు అడ్వాన్స్ లు చేతిలో వున్నాయి.

ఇవ్వని వాళ్లది పాపం, అడ్వాన్స్ లు అన్ని వున్నాయి అన్నది ఇండస్ట్రీ గుసగుస.  కానీ సినిమా సెట్ కావడం లేదు. రీసెంట్ గా హీరో నాగశౌర్య స్వంత బ్యానర్ దగ్గర కూడా అడ్వాన్స్ పట్టేసారని టాక్. 

టచ్ చేయని హీరో లేరు. కానీ ఏ హీరో కూడా డేట్ లు ఇవ్వడం లేదు. ఆఖరికి గా రవితేజ పేరు వినిపించింది.  కానీ ఇప్పుడు ఆయన కూడా వెనక్కు పెడుతున్నట్లు తెలుస్తోంది. రమేష్ వర్మ డైరక్షన్ లో సినిమా చేయబోతున్నారు.

ఆ తరువాత చేయబోయే సినిమాకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. అలాగే వక్కంతం వంశీ కూడా అక్కడే వెయిటింగ్ లో వున్నారు. అంటే నక్కినకు అక్కడ ఇప్పట్లో చాన్స్ రావడం కష్టమే.

హీరోలు ఎవ్వరూ ఖాళీ లేరు. ప్రతి హీరో రెండు మూడు సినిమాలు లైన్ లో పెట్టేసుకుని వున్నారు. ఇలాంటి టైమ్ లో సినిమా సెట్ కావాలంటే చాలా అంటే చాలా అదృష్టం వుండాలి.

హ‌రిబాబుకు అంతేనా